సమస్యలను వెంటనే పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

Apr 18 2026 7:29 AM | Updated on Apr 18 2026 7:29 AM

సమస్యలను వెంటనే పరిష్కరించాలి

కామారెడ్డి అర్బన్‌: ఉద్యోగుల నాలుగు ప్రధాన సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఉద్యోగులు, గెజిటెడ్‌ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మిక, పెన్షనర్ల జాయింట్‌ యాక్షన్‌ కమిటీ (టీజీఈజేఏసీ) డిమాండ్‌ చేసింది. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌తోపాటు తహసీల్‌ కార్యాలయాల వద్ద ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కలెక్టరేట్‌లో అడిషనల్‌ కలెక్టర్‌ విక్టర్‌కు వినతి పత్రం ఇచ్చారు. పీఆర్‌సీ, పెండింగ్‌ బిల్లులు, ఉద్యోగులు, పెన్షనర్ల నగదు రహిత ఆరోగ్య బీమా కార్డులు, పాత పెన్షన్‌ విధానం అమలు అంశాలపై ప్రభుత్వం వెంటనే కార్యాచరణ ప్రకటించాలన్నారు. దీర్ఘకాలంగా పెండింగ్‌ ఉన్న 64 అంశాలను పరిశీలించి పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో టీజీఈజేఏసీ జిల్లా సెక్రెటరీ జనరల్‌ దేవేందర్‌, రాష్ట్ర కోచైర్మన్‌ అనిల్‌, జిల్లా సెక్రెటరీ జనరల్‌ కుషాల్‌, నాయకులు సాయిరెడ్డి, శ్రీనివాస్‌, నాగరాజు, బాబు, లింగం, భూమయ్య, హన్మంతురెడ్డి, కలీముద్దీన్‌, చక్రధర్‌, మోహన్‌రావు, ప్రవీణ్‌కుమార్‌, శివశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement