కామారెడ్డి అర్బన్: మహారాష్ట్రలోని సాఫ్ట్‌వేర్ కంపెనీ లో చోటు చేసుకున్న లవ్ జిహాద్ ఘటనలు ఎక్కడా జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్‌పీ, బజరంగ్‌దళ్ ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఆ ఘటనకు నిరసనగా శుక్రవారం జిల్లాకేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వీహెచ్‌పీ జిల్లా అధ్యక్షుడు నిత్యానందం మాట్లాడుతూ సాఫ్ట్‌వేర్ కంపెనీలో లవ్ జిహాద్ పేరుతో యువతులపై జరిగిన ఘటనలు సభ్య సమాజం తలదించుకునేవిగా ఉన్నాయన్నారు. ఇలాంటి ఘటనలకు కారణమైనవారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళనలో వీహెచ్‌పీ జిల్లా ఉపాధ్యక్షుడు సామల గంగారెడ్డి, కార్యదర్శి బొల్లి రాజు, ప్రచార ప్రముఖ్ శ్రీకాంత్‌రావు, నగర అధ్యక్షుడు పట్నం రమేశ్, బజరంగ్‌దళ్ జిల్లా సంయోజక్ వివేకానంద అశోక్, జిల్లా గోరక్షక్ ఏకేష్, ప్రతినిధులు పాపారావు, మణితేజ తదితరులు పాల్గొన్నారు.


