సర్టిఫికెట్ల ప్రదానం | - | Sakshi
Sakshi News home page

సర్టిఫికెట్ల ప్రదానం

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

సర్టిఫికెట్ల ప్రదానం

బీబీపేట్‌: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నాణ్యమైన అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలనే లక్ష్యంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో గురువారం మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు గణితం, సైన్స్‌ విభాగాల్లో పోటీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా గెజిటెడ్‌ ప్రధానోపాధ్యాయులు మూలరెడ్డి రవీంద్రారెడ్డి మాట్లాడుతూ.. ఫిబ్రవరి నెలలో 60 నిమిషాలకు పైగా నిరంతరంగా డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌పై శిక్షణ పొందడమే కాకుండా, గణితం, సైన్స్‌ సబ్జెక్టులలో ఈ విద్యా సంవత్సరంలో 9 కంటే ఎక్కువ క్లిష్టమైన నైపుణ్యాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు ఈ గుర్తింపు లభించిందని తెలిపారు. ఈ వేడుకలో పాఠశాల ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు, ఇతర సిబ్బంది పాల్గొని విజేతలకు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement