● సబ్ కలెక్టర్ కిరణ్మయి
మద్నూర్(జుక్కల్): అంగన్‌వాడీ కేంద్రంలోని చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలని బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. మండల కేంద్రంలో గురువారం పోషణ్ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన పోషకాలతో తయారు చేసిన వంటకాల స్టాళ్లలను సబ్ కలెక్టర్ పరిశీలించారు. గర్భిణులు, బాలింతలకు తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. తల్లి పాలు బిడ్డకు ఎంతో శ్రేష్టమైనవని చెప్పారు. అనంతరం సర్పంచ్ మచ్కురీ ఉష సంతోష్‌మేసీ్త్ర మాట్లాడుతూ.. పలు సూచనలు ఇచ్చారు.


