జీపీ విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించండి | - | Sakshi
Sakshi News home page

జీపీ విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించండి

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

జీపీ విస్తీర్ణం, సరిహద్దులను గుర్తించండి

నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): తమ గ్రామ పంచాయతీ విస్తీర్ణంతోపాటు సరిహద్దులను గుర్తించాలని కోరుతూ గురువారం నాగిరెడ్డిపేట మండలంలోని గోపాల్‌పేట సర్పంచ్‌ వంశీకృష్ణగౌడ్‌, ఉపసర్పంచ్‌ గులామ్‌.. ఇన్‌చార్జి తహసీల్దార్‌ రాజేశ్వర్‌కు వినతిపత్రాన్ని అంజేశారు. 2018లో తమ పంచాయతీని 800 ఎకరాల విస్తీర్ణంతో ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా వారు ఇన్‌చార్జి తహసీల్దార్‌కు తెలిపారు. ఈ క్రమంలో తమ గ్రామపంచాయతీకి సంబంధించి సరిహద్దులతో కూడిన మ్యాప్‌ను తమకు అందజేయాలని వారు కోరారు. జీపీ కార్యదర్శి రాజు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement