టేకు దుంగల పట్టివేత | - | Sakshi
Sakshi News home page

టేకు దుంగల పట్టివేత

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

సిరికొండ: మండలంలోని న్యావనంది గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు దుంగలను గురువారం పట్టుకున్నట్లు సిరికొండ ఎఫ్‌ఆర్వో కే నర్సింగరావు తెలిపారు. విశ్వసనీయ సమా చారం మేరకు గ్రామంలో తనిఖీ చేయగా బహిరంగ ప్రదేశంలో 32 టేకు దుంగలు లభ్యం కాగా, వాటిని స్వాధీనం చేసుకొని సిరికొండలోని రేంజ్‌ కార్యాలయానికి తరలించామన్నారు. దుంగల విలువ రూ. 25 వేల వరకు ఉంటుందని, ఎవరు నిల్వ చేశారనేది విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఆయన వెంట డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ గంగారం, బీట్‌ అధికారి నవీన్‌, బేస్‌ క్యాంపు సిబ్బంది రమేశ్‌, గోపాల్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement