నేడు ఉపాధ్యాయ సమస్యలపై తహసీల్దార్లకు వినతి | - | Sakshi
Sakshi News home page

నేడు ఉపాధ్యాయ సమస్యలపై తహసీల్దార్లకు వినతి

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

నేడు ఉపాధ్యాయ సమస్యలపై తహసీల్దార్లకు వినతి హిందూ సమ్మేళనాన్ని జయప్రదం చేయాలి సరుకుల పంపిణీ బాధ్యతల స్వీకరణ

బాన్సువాడ: ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు ఇవ్వాలని తపస్‌ జిల్లా అధ్యక్షుడు భూనేకర్‌ సంతోష్‌ పిలుపునిచ్చారు. గురువారం బాన్సువాడలో తపస్‌ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయ సమస్యలైన పెండింగ్‌ బిల్లులు, డీఏలు, పీఆర్సీలు, సీపీఎస్‌ విధానం రద్దు, సాధారణ బదిలీలు, కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌ ఉపాధ్యాయుల సమస్యలపై అన్ని మండల కేంద్రాల్లోని తహసీల్దార్లకు వినతి పత్రాలు అందజేయాలని సూచించారు. నేతలు పాలేటి వెంకట్రావ్‌, రవీంద్రనాథ్‌ఆర్య, రమేష్‌కుమార్‌, రాఘవరెడ్డి, సత్యనారాయణ, లక్ష్మీపతి, జనార్ధన్‌, వేదప్రకాష్‌, శివకాంత్‌, కృష్ణ, తారచంద్‌ తదితరులున్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): ఈ నెల 19న మహమ్మ ద్‌ నగర్‌ మండల కేంద్రంలోని సొసైటీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహిస్తున్న హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సమ్మేళన కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి కోరారు. గురువారం మహమ్మద్‌నగర్‌ మండలం గున్కుల్‌ గ్రామంలో హిందూ సమ్మేళన కార్యక్రమం కరపత్రాలను ఇంటింటికీ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతీ ఒక్క హిందు బంధువు సమ్మేళనానికి తరలి రావాలని కోరారు. గున్కుల్‌ గ్రామ సర్పంచ్‌ రమేష్‌యాదవ్‌, హిందు సమ్మేళన నిర్వాహకులు భానుప్రకాష్‌, రవికిరణ్‌, మోహన్‌, భాస్కర్‌, సంతు తదితరులు ఉన్నారు.

బాన్సువాడ రూరల్‌: మండలంలోని చిన్న రాంపూర్‌లో గ్రామానికి చెందిన ముగ్గురు వృద్ధులకు లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ బాన్సువాడ ఆధ్వర్యంలో గురువారం కిరాణా సరుకులు పంపిణీ చేశారు. సుమారు 70 సంవత్సరాలు పైబడినా ఆసరా పెన్షన్‌ మంజూరు కాకపోవడంతో వారి కుటుంబాలు దీనవాస్థలో ఉన్నట్లు గుర్తించి సహాయం అందించినట్లు లయన్స్‌క్లబ్‌ ప్రతినిధులు తెలిపారు. ఒక్కొక్కరికి సుమారు రూ.2 వేల విలువ చేసే కిట్‌లను అందించారు. గ్రామ ఉపసర్పంచ్‌ షేఖ్‌ అజీజ్‌, లయన్స్‌ ప్రతినిధులు ఖలీద్‌, దుద్దాల అంజిరెడ్డి, బెజుగం వెంకటరమణ, ప్రకాష్‌, ప్రధానోపాధ్యాయులు వీరప్ప, నాయకులు కుర్మ గణేష్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

పెద్దకొడప్‌గల్‌(జుక్కల్‌):పెద్దకొడప్‌గల్‌నూతన తహసీల్దార్‌గా గురువారం రాజశేఖర్‌ పదవీ బాధ్యతలు చేపట్టారు. పెద్దకొడప్‌గల్‌ తహసీల్దార్‌గా పని చేసిన భిక్షపతి నాగిరెడ్డిపేట్‌ మండలానికి బదిలీపై వెళారు. రాజశేఖర్‌ గతంలో నిజామాబాద్‌ జిల్లా మోస్రా తహసీల్దార్‌గా పని చేశారు. తహసీల్దార్‌ రాజశేఖర్‌ మాట్లాడుతూ.. ప్రజల సమస్యలు తీర్చడంలో ప్రతి క్షణం కృషి చేస్తానని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement