జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్‌ సాంకేతికతకు ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్‌ సాంకేతికతకు ప్రాధాన్యం

Apr 17 2026 11:20 AM | Updated on Apr 17 2026 11:20 AM

హెచ్‌సీయూ ప్రొఫెసర్‌ రాజగోపాల్‌

తెయూ(డిచ్‌పల్లి): ఆధునిక జీవశాస్త్ర పరిశోధనలో మాలిక్యులర్‌ సాంకేతికత ఎంతగానో ప్రాముఖ్యత వహిస్తుందని హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ప్రొఫెస ర్‌ రాజగోపాల్‌ పేర్కొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘హైమీడియా లాబొరేటరీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సహకారంతో గురువారం ‘జెనోమిక్‌ – ప్లాస్మిడ్‌ డీఎన్‌ఏ ఐసోలేషన్‌ అండ్‌ జెల్‌ ఎలెక్ట్రోఫోరేసిస్‌ టెక్నిక్స్‌’ అనే అంశంపై ఒక రోజు వర్క్‌షాప్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్‌ రాజగోపాల్‌ మాట్లాడుతూ డీఎన్‌ఏ ఐసోలేషన్‌లో సంప్రదాయ పద్ధతులు, ఆధునిక కిట్‌ ఆధారిత పద్ధతులపై వచ్చిన మార్పు లపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం హైమీడియా లాబొరేటరీస్‌ నిపుణులు కిరణ్‌ కుమార్‌, రాజేశ్‌ గౌడ్‌ ప్రసంగించారు. కార్యక్రమంలో సైన్స్‌ డీన్‌ ప్రొఫెసర్‌ సంపత్‌కుమార్‌, విభాగాధిపతి అబ్దుల్‌ అలీమ్‌ ఖాన్‌, బీవోఎస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఎం.అరుణ, ప్రొఫె సర్‌ విద్యావర్థిని, అధ్యాపకులు డీ శ్రీనివాస్‌, వీ జలంధర్‌, పీ సుబ్రమణ్యం, ప్రవీణ్‌, సంతోష్‌, అమ్రీన్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement