కామారెడ్డి అర్బన్/కామారెడ్డిటౌన్: అంబేడ్కర్ సంఘాలు అడుక్కు తింటున్నాయని, బిచ్చమెత్తుకుంటున్నాయని అహంకారంగా మాట్లాడిన పాల్వంచ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పల్లె రమేష్‌గౌడ్‌పై గురువారం కామారెడ్డి ఏఎస్పీకి ఫిర్యాదు చేసినట్టు అంబేడ్కర్ సంఘం జిల్లా నాయకులు తెలిపారు. స్థానిక ఆర్ అండ్ బీ అతిథి గృహంలో నాయకులు మాట్లాడారు. అంబేడ్కర్ జయంతి రోజున ఫరీద్‌పేటలో ఏర్పాటు చేసిన సభలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పల్లెరమేష్ గౌడ్ దళిత సంఘాలపై అనుచిత వాఖ్యలు చేశారని, ఇప్పటికై నా బహిరంగ క్షమాపణ చెబితే వదిలిపెడతామని, లేకుంటే ఆయన ఇల్లు ముట్టడించడంతో పాటు ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కోసం పోలీసు ఉన్నతాధికారులతో పాటు పీసీసీ అధ్యఽక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలుస్తామన్నారు. సంఘం నేతలు ఆకుల బాబు, కె.గంగారాం, రాజలింగం, బి.బాల్‌రాజు, వెంకటరాములు, ఎస్.లక్ష్మి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.


