సామాజిక వర్గాలు, ప్రధాన కులాలవారీగా కుటుంబాలు, జనాభా వివరాలు..
జిల్లాలో కులాలు, ఉపకులాలకు సంబంధించిన లెక్క తేలింది. 2024లో నిర్వహించిన కుల, ఉద్యోగ, సామాజిక గణనలో ఆయా కులాలకు సంబంధించి కుటుంబాలు, జనాభా లెక్కలను ప్రభుత్వం వెలువరించింది. జిల్లా జనాభాలో 55.53 శాతం బీసీలు ఉండగా, 16.82 శాతం ఎస్సీలు, 9.90 శాతం ఎస్టీలు, 6.94 శాతం బీసీ ముస్లింలు, 8.71 శాతం ఓసీలు ఉన్నట్లు వెల్లడైంది. కులాల వారీగా పరిశీలిస్తే ముదిరాజ్‌లు ఎక్కువగా ఉన్నారు. 41,349 కుటుంబాల పరిధిలో 1,29,842 మంది ముదిరాజ్‌లున్నారు. బీసీ జనాభాలో వీరు 20.65 శాతం కావడం గమనార్హం.
జిల్లా జనాభాలో 27,278 ఎస్టీ కుటుంబాలలో 98,311 జనాభా ఉంది. ఇందులో 91.57 శాతం అంటే 90,028 మంది లంబాడీలు కావడం గమనార్హం.
జిల్లాలో ఎస్సీ కుటుంబాలు 51,791 ఉండగా.. జనాభా 1,67,071 మంది ఉన్నారు. ఇందులో 26,299 మాదిగ కుటుంబాలలో 84,792 మంది నివసిస్తున్నారు. ఎస్సీల్లో వీరి శాతం 50.75 గా ఉంది. 19,433 మాల కుటుంబాల్లో 62,104 మంది ఉన్నారు. ఎస్సీల్లో వీరి సంఖ్య 37.17 శాతం.
జిల్లాలో ఓసీ కుటుంబాలు 28,838 ఉన్నాయి. 86,515 జనాభాతో 8.71 శాతం ఉన్నట్లు తేలింది. ఇందులో రెడ్డి కులం వారు 44,215 మంది ఉన్నారు. ఓసీల్లో 51.11 శాతం రెడ్డీలే.. ఓసీ జనాభాలో వైశ్యులు 20.14 శాతం ఉన్నారు.
నో క్యాస్ట్ కుటుంబాలు 1,751...
జిల్లాలో కులం లేని కుటుంబాలు 1,751 ఉన్నాయి. ఆయా కుటుంబాలలో 5,538 మంది ఉన్నారు.
కులం కుటుంబాలు శాతం జనాభా శాతం
ఎస్సీ 51,791 16.81 1,67,071 16.82
మాదిగ 26,299 56.78 84,792 50.75
మాల 19,433 37.52 62,104 37.17
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఎస్టీ 27,278 8.85 98,311 9.90
లంబాడీ 24,732 90.67 90,028 91.57
–––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––––
ఓసీ 28,838 9.36 86,515 8.71
రెడ్డి 15,623 54.18 44,215 51.11
వైశ్య 5,507 19.10 17,423 20.14
ముస్లిం(ఓసీ) 2409 8.35 8,971 10.37
వెలమ 788 2.73 2144 2.48
కులాల లెక్క తేలింది. జిల్లాలో యాభై శాతానికిపైగా బలహీన వర్గాలకు చెందినవారే.. కులాలవారీగా తీసుకుంటే ముదిరాజ్‌లు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. తర్వాతి స్థానాల్లో లంబాడీలు, మాదిగలు, మాలలు, మున్నూరు కాపులున్నారు. – సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
తేలిన కులాల లెక్క
ఎస్సీలు 16.82 శాతం,
ఎస్టీలు 9.90 శాతం
జనాభాలో ముదిరాజ్‌లే అధికం
తర్వాతి స్థానాల్లో లంబాడీలు,
మాదిగలు, మాలలు..


