‘సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలి’ | - | Sakshi
Sakshi News home page

‘సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలి’

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

‘సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలి’ స్పోర్ట్స్‌ డిప్లొమా కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం రేపు జాబ్‌మేళా సైన్స్‌ మార్కులు విడివిడిగా చూపాలి నేడు నిరసన కార్యక్రమం

లింగంపేట: ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందరికీ అందేలా చూడాలని మండల ప్రత్యేకాధికారి, డీఈవో రాజు సూచించారు. గురువారం లింగంపేటలోని జీఎన్‌ఆర్‌ గార్డెన్‌లో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’పై అన్ని శాఖల అ ధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు పా ఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే విద్యాసంవత్సరంలో ప్రాథమిక పాఠశాలల నుంచి ఇంటర్మీడియట్‌ వరకు అల్పాహారం, మధ్యాహ్న భోజన వసతి కల్పించనున్న ట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించారు. అధికారులు తమ శాఖల అభివృద్ధి నివేదికలను చదివి వినిపించారు. మహిళా సంఘాలు తయారు చేసిన ఉత్పత్తులను ఈ సందర్భంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో ఎంపీడీవో నరేష్‌, తహసిల్దార్‌ సురేష్‌, ఎంపీవో మలహరి, ఎంఈవో అంజల్‌రెడ్డి ఏవో అనిల్‌కుమార్‌, ఏపీఎం వినోద్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: గ్వాలియర్‌లోని లక్ష్మీబాయి నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎల్‌ఏన్‌ఐపీఈ)లో పలు డిప్లొమా కోర్సుల లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈ విషయాన్ని జిల్లా యువజన క్రీడల అధి కారి రంగా వెంకటేశ్వర్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తె లిపారు. డిప్లొమా ఇన్‌ స్పోర్ట్స్‌ కోచింగ్‌, ఫిట్‌ నెస్‌ మేనేజ్‌మెంట్‌, స్ట్రెంత్‌, స్పోర్ట్స్‌ కండిషనింగ్‌, బీపెడ్‌, ఎంపెడ్‌, స్పోర్ట్స్‌ సైన్స్‌, ఎంఏ యో గా, స్పోర్ట్స్‌ మేనేజ్‌మెంట్‌, క్రీడా జర్నలిజం తదితర కోర్సుల్లో ప్రవేశాలకోసం అన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు కలెక్టరేట్‌లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి అర్బన్‌: కలెక్టరేట్‌లో శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి రజని కిరణ్‌ ఒక ప్రకటనలో తెలిపా రు. గూగుల్‌ పేలో ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఈ మేళా ఏర్పాటు చేస్తున్నామని పే ర్కొన్నారు. శనివారం ఉదయం 10.30 గంట లకు కలెక్టరేట్‌లోని 121 గదిలో మేళా ఉంటుందని, ద్విచక్ర వాహనం ఉన్న 18 నుంచి 35 ఏళ్లలోపు వారు పాల్గొనాలని తెలిపారు. వివరాలకోసం 97044 12792, 63057 43423 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.

కామారెడ్డి టౌన్‌ : ఎస్సెస్సీ పరీక్ష ఫలితాల్లో సై న్స్‌ సబ్జెక్టుకు సంబంధించి ఫిజికల్‌ సైన్స్‌, బ యోసైన్స్‌ మార్కులను విడివిడిగా మార్కు లి స్టులో పొందుపరచాలని ఉపాధ్యాయులు కో రారు. గురువారం జిల్లా సహాయ పరీక్షల కమిషనర్‌(ఏసీజీఈ) బలరాంను కలిసి వినతి ప త్రం అందజేశారు. ప్రస్తుతం సైన్స్‌ సబ్జెక్టులోని రెండు విభాగాలకు కలిపి ఒకే గ్రేడ్‌ లేదా మా ర్కులు ఇస్తున్నారని, దీనివల్ల విద్యార్థులకు ఏ విభాగంలో పట్టుందో తెలియడం లేదని పేర్కొన్నారు. ఫిజికల్‌ సైన్స్‌, బయోసైన్స్‌ మార్కులను విడివిడిగా చూపిస్తే విద్యార్థులు తమ ప్రతిభను సరిగ్గా అంచనా వేసుకోవడమే కాకుండా, ఇంటర్‌లో సరైన గ్రూపులను ఎంచుకోవడానికి వీలవుతుందని వివరించారు.

కామారెడ్డి అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, వి శ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదని పీఆర్‌టీ యూ రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ రాష్ట్ర అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ దామోదర్‌రెడ్డి ఆరోపించారు. గురువారం కామారెడ్డిలోని పీఆర్‌టీ యూ జిల్లా భవన్‌లో టీజీఈజేఏసీ జిల్లా స మావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దా మోదర్‌రెడ్డి మాట్లాడుతూ నగదు రహిత ఆరో గ్య బీమాను తక్షణమే అమలు చేయాలని, పీఆర్‌సీ బకాయిలను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. ఈ డిమాండ్లతో శుక్రవారం కలెక్టరేట్‌తోపాటు తహసీల్‌ కార్యాలయాల వద్ద మధ్యాహ్న భోజన సమయంలో చేపట్టే నిరసనలను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జేఏసీ జిల్లా కార్యదర్శి దేవేందర్‌, అడిషనల్‌ సెక్రెటరీ జనరల్‌ కుషాల్‌, ప్రతినిధులు సాయిరెడ్డి, నాగరాజు, లింగం, విజయరామరాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement