మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత | - | Sakshi
Sakshi News home page

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత

కామారెడ్డి క్రైం: జిల్లాలో క్రీడలు, వినోద కార్యక్రమాలను ప్రోత్సహించడానికి అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియం వద్ద నిర్మాణంలో ఉన్న ఇండోర్‌ స్టేడియం పనులను కలెక్టర్‌ గురువారం పరిశీలించారు. పనులు నాణ్యతతో చేపట్టాలని, ప్రాజెక్టును గడువులోపు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న కబడ్డీ సమ్మర్‌ కోచింగ్‌ క్యాంపును సందర్శించారు. విద్యార్థులతో కలిసి కబడ్డీ ఆడారు. ఇండోర్‌ స్టేడియంలో 4 షటిల్‌ బ్యాడ్మింటన్‌ కోర్టులు, యోగా హాల్‌, ఇండోర్‌ క్రీడల సదుపాయాలు, జిమ్‌, రైఫిల్‌ షూటింగ్‌, స్క్వాష్‌ కోర్ట్‌ లాంటి ఆధునిక సౌకర్యాలను కల్పిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో గిరి, పబ్లిక్‌ హెల్త్‌ డీఈ సంతోష్‌, అధికారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement