● మహిళా సర్పంచులకు
మూలన సీట్ల కేటాయింపు
● అధికారుల తీరుపై విమర్శలు
బీబీపేట: ప్రజాపాలన సమావేశాలలో మహిళా సర్పంచ్‌లకు గౌరవం దక్కడం లేదు. సమావేశాలలో అధికారులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని పలువురు మహిళా సర్పంచ్‌లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మండల కేంద్రంలోని వాసవి క్లబ్‌లో ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి స్థానిక సర్పంచ్ ఏదుళ్ల సాద్విక అధ్యక్షత వహించాల్సి ఉండగా.. ఆమెకు వేదికపై ఒక మూలన కుర్చీ కేటాయించారు. అంతేకాక మండలంలోని మరో ముగ్గురు మహిళా సర్పంచ్‌లకూ వేదికపై తగిన ప్రాధాన్యత ఇవ్వలేదు. దీనిపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


