అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

అగ్ని ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి

Apr 17 2026 10:38 AM | Updated on Apr 17 2026 10:38 AM

కామారెడ్డి టౌన్‌ : అగ్నిప్రమాదాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా గృహ అవసరాలకు వాడే గ్యాస్‌ సిలిండర్ల విషయంలో తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా అగ్నిమాపక అధికారి సుధాకర్‌ సూచించారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లా కేంద్రంలోని ఎన్జీవోస్‌ కాలనీలో అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వంటగదిలో ఎల్పీజీ గ్యాస్‌ లీకై నప్పుడు లేదా నూనె వల్ల అగ్నిప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రమాదం జరిగినప్పుడు కంగారు పడకుండా ‘స్టాప్‌, డ్రాప్‌ అండ్‌ రోల్‌’ పద్ధతిని పాటించాలన్నారు. చిన్నపాటి మంటలను నియంత్రించేందుకు తడిపిన గొంగళి(బ్లాంకెట్‌)ని ఎలా ఉపయోగించాలో వివరించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జి స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ రవీందర్‌ రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గడ్డం ఇందుప్రియ, అగ్నిమాపక శాఖ సిబ్బంది, కాలనీవాసులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement