వెంటనే వ్యాపారాలు ప్రారంభించండి | - | Sakshi
Sakshi News home page

వెంటనే వ్యాపారాలు ప్రారంభించండి

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

వెంటనే వ్యాపారాలు ప్రారంభించండి మాజీ ఎంపీపీకి పరామర్శ

గాంధారి(ఎల్లారెడ్డి): మహిళా సమాఖ్య సంఘాల సభ్యులు వెంటనే వ్యాపారాలు ప్రారంభించాలని మండల ప్రత్యేకాధికారి, డీఆర్‌డీవో సురేందర్‌ అన్నారు. బుధవారం ఆయన మండలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మహిళా సమాఖ్య భవనంలో ఎంపీడీవో రాజేశ్వర్‌, ఏపీఎం ప్రసన్న కుమార్‌తో కలిసి మహిళా సమాఖ్య సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. పలు విషయాలపై అవగాహన కల్పించారు. ఐకేపీ సిబ్బంది, మహిళా సమాఖ్య సభ్యులు పాల్గొన్నారు.

నిజాంసాగర్‌(జుక్కల్‌): మహమ్మద్‌ నగర్‌ మండలం గున్కుల్‌లో ఉమ్మడి మండల మాజీ ఎంపీపీ వీరంగణాబాయిని బుధవారం డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్‌ పరామర్శించారు. మాజీ ఎంపీపీ భర్త ఈశ్వర్‌ పటేల్‌ 15 రోజుల కిందట మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఆయన.. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఆయన వెంట మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు రమేష్‌యాదవ్‌, సర్పంచులు, కాంగ్రెస్‌ నాయకులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement