కామారెడ్డి అర్బన్: కామారెడ్డి హన్‌మాన్ మందిర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు కేపీ రాజారెడ్డి జనసేవ ట్రస్ట్ తరపున ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి 80 డ్యుయల్ డెస్క్‌లను అందించినట్లు హెడ్‌మాస్టర్ అరుణ తెలిపారు. బెంచీలు అందజేసినందుకు విద్యార్థులు ఎమ్మెల్యేకు ధన్యవాదాలు తెలిపారు. బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ కౌన్సిలర్లు శ్రీధర్‌రెడ్డి, ఎం.శ్రీకాంత్, లక్ష్మారెడ్డి, నాయకులు మోహన్‌రెడ్డి, అశోక్, భూమేశ్ యాదవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మండల అధికారులపై
చర్యలు తీసుకోవాలి
లింగంపేట(ఎల్లారెడ్డి): భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ విగ్రహాలపై వివక్ష చూపిన మండల అధికారులపై చర్యలు తీసుకోవాలని సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి లెగ్గెల రాజు డిమాండు చేశారు. బుధవారం ఆయన లింగంపేటలో మాట్లాడారు. జయంతికి ముందు అంబేడ్కర్ విగ్రహాలకు రంగులు వేసి, పూలతో అలంకరించాలని సర్కులర్ విడుదలైనా.. ఈ విషయమై గ్రామ పంచాయతీల కార్యదర్శులు, మండల అధికారులు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండానే జయంతి నిర్వహించినట్లు ఆరోపించారు. వివక్ష చూపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండు చేశారు.


