హోంగార్డు మృతి | - | Sakshi
Sakshi News home page

హోంగార్డు మృతి

Apr 16 2026 10:12 AM | Updated on Apr 16 2026 10:12 AM

హోంగార్డు మృతి

భిక్కనూరు: మండల కేంధ్రానికి చెందిన హోంగార్డు ఈరబత్తిని సురేష్‌(42) బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన కొన్నిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ నిజామాబాద్‌ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మరణించారు. సురేష్‌ ప్రస్తుతం బీబీపేట పోలీస్‌ స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నారు. భిక్కనూరు దుర్గా నవరాత్రి ఉత్సవ కమిటీలో సభ్యునిగా ఉన్న సురేష్‌ మృతితో భిక్కనూరు మండల కేంద్రంలో విషాద ఛాయ లు అలుముకున్నాయి. అందరితో కలుపుగోలుగా ఉండే సురేష్‌ మృతి వార్తను ఆయన స్నేహితులు, కుటుంబీకులు జీర్ణించుకోలేకపోతున్నారు. సురేష్‌ అంత్యక్రియలు గురువారం జరుగనున్నా యి. సురేష్‌కు భార్య, ఇద్దరు కుమారులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement