‘కార్పొరేట్‌ స్థాయిలో సర్కారు బడి ఉంది’ | - | Sakshi
Sakshi News home page

‘కార్పొరేట్‌ స్థాయిలో సర్కారు బడి ఉంది’

Apr 16 2026 10:06 AM | Updated on Apr 16 2026 10:06 AM

‘కార్పొరేట్‌ స్థాయిలో సర్కారు బడి ఉంది’ ‘ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం’ గనుల శాఖ ఉద్యోగికి అస్వస్థత రేపు ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ నిరసన క్యాతం వెన్నెలకు రాష్ట్రీయ సమ్మాన్‌ అవార్డ్‌

బీబీపేట: కార్పొరేట్‌ స్థాయిలో పాఠశాల భవనం ఉండడమే కాకుండా అంతకంటే మించి వసతులు బాగున్నాయని రిటైర్డ్‌ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నాగిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన మండల కేంద్రంలోని టీఎస్‌ఎన్‌ఆర్‌ బాలుర ఉన్నత పాఠశాలను సందర్శించారు. ప్రముఖ వ్యాపారవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి పాఠశాల భవనాన్ని అధ్బుతంగా నిర్మించారని, అంతటితో వదిలేయకుండా పాఠశాలలో వసతులు కూడా కల్పిస్తుండడం అభినందనీయమని పేర్కొన్నారు. కంప్యూటర్‌ ల్యాబ్‌, సైన్స్‌ ల్యాబ్‌, గ్రంథాలయం, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌ తదితర వాటిని పరిశీలించారు. ఆయన వెంట ప్రధానోపాధ్యాయుడు మూల రవీంద్రారెడ్డి, ఉపాధ్యాయులు ఉన్నారు.

నిజాంసాగర్‌: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ పేర్కొన్నారు. బుధవారం మహమ్మద్‌నగర్‌ మండలంలోని నర్వలో ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో మహమ్మద్‌నగర్‌ మండల కాంగ్రెస్‌ అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి సర్పంచ్‌లు రమేశ్‌ యాదవ్‌, అనసూజ, జీవన్‌, కిరణ్‌, నాయకులు నర్సింలు, అతిఖ్‌, ఆకాష్‌, శ్రీనివాస్‌ సేట్‌, రామాగౌడ్‌, శివ రాజ్‌, కాశయ్య, సాయాగౌడ్‌ పాల్గొన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కలెక్టరేట్‌లోని గనులు, భూగర్భజల శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.గంగాగౌడ్‌ బుధవారం మధ్యాహ్నం అస్వస్థతకు గురయ్యారు. వెంటనే అధికారులు ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. గుండె సంబంధ సమస్యతో బాధపడుతున్నట్లు గుర్తించి వైద్య సేవలు అందిస్తున్నారు.

కామారెడ్డి అర్బన్‌: తెలంగాణ ఉద్యోగ, ఉపాధ్యాయ, గెజిటెడ్‌ అధికారులు, కార్మిక, పెన్షనర్స్‌ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. శుక్రవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో కలెక్టరేట్‌, తహసీల్‌ కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు జేఏసీ జిల్లా చైర్మన్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలను కలెక్టర్‌, తహసీల్దార్లకు అందజేస్తామని పేర్కొన్నారు.

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణానికి చెందిన గురుకుల ఉపాధ్యాయురాలు క్యాతం వెన్నెల అంబేడ్కర్‌ రాష్ట్రీయ సమ్మాన్‌ అవార్డుకు ఎంపికయ్యారు. ఆమె మైక్రో ఆర్టిస్ట్‌గా, సామాజిక కార్యకర్తగా, రక్తదాతగా అనేక సేవాకార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. 150 నిమిషాల్లో 365 నువ్వు గింజలపై తెలంగాణ రాష్ట్ర గీతాన్ని రాసి తెలంగాణ బుక్‌ ఆఫ్‌ రికార్డులో పేరు నమోదు చేసుకుంది. తన పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటి వరకు 15 పర్యాయాలు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచింది. ఈ నేపథ్యంలో ఆమెను ముంబయికి చెందిన గ్లోబల్‌ ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియా డాట్‌ కామ్‌ ఆధ్వర్యంలో సామాజిక సేవా కార్యక్రమాల్లో ఎక్సలెన్స్‌ అవార్డుకు ఎంపిక చేశారు. వెన్నెల సేవా కార్యక్రమాలపై గ్లోబల్‌ ఐకాన్స్‌ ఆఫ్‌ ఇండియా తన మ్యాగజైన్‌లో సక్సెస్‌ స్టోరీ సైతం ప్రచురించింది.

24 నుంచి ఎంఈడీ పరీక్షలు

తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో ఎంఈడీ మొదటి సెమిస్టర్‌ రెగ్యుల ర్‌ పరీక్షలు 24 నుంచి ప్రారంభమవుతాయ ని పరీక్షల నియంత్రణాధికారి సంపత్‌కుమార్‌ తెలిపారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్‌సైట్‌ www.telanganauniversity. ac.in లో సంప్రదించాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement