భిక్కనూరు: రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజాపాలన కాదని.. రేవంత్‌రెడ్డి రాక్షస పాలన అని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ పేర్కొన్నారు. భిక్కనూరు పోలీస్ స్టేషన్‌లో ఆయన మాట్లాడారు. ఎల్లారెడ్డి హాస్టల్‌లో అనుమానాస్పద స్థితిలో విద్యార్థి శ్రావణి మృతి చెందిందని, దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ప్రజలు నిరసన తెలిపారని పేర్కొన్నారు. బాధితులకు న్యాయం కోసం ఆందోళన చేస్తున్న తమను అరెస్ట్ చేయడం ఎంత వరకు సమంజసమన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించినందుకు అరెస్టు చేయడం సిగ్గుచేటన్నారు. విద్యార్థి శ్రావణి మృతికి పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. శ్రావణి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. ఆమె మృతిపై నిజానిజాలు తేల్చేవరకు బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని పేర్కొన్నారు. ఆందోళనల్లో బీఆర్‌ఎస్ నేతలు అందె మహేందర్‌రెడ్డి, తున్కి వేణు, సాయగౌడ్, పాల రాంచంద్రం, వెంకట్‌రెడ్డి, నర్సారెడ్డి, మధుమోహన్‌రెడ్డి, వాసుయాదవ్, రవీందర్‌రెడ్డి, యాదగిరి, శ్రీశైలం, మల్లేశం, కనకరాజు, సరస్వతి ప్రభాకర్, హన్మంత్‌రెడ్డి, బాబు, పోతిరెడ్డి, నరేందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, బాలకృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


