ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయనున్న ప్రభుత్వ ఉన్నత పాఠశా ల పరిసరాలను డీఈవో రాజు మంగళవారం పరిశీలించారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యాసంవత్సరంలో టీపీవో ప్రారంభం కానుందన్నారు. నర్సరీ నుంచి ఇంటర్ వరకు తరగతులు నిర్వహిస్తామన్నారు. అవసరమై తరగతి గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి సంబందించిన పనులు త్వరలోనే ప్రారంభమవుతాయన్నారు. ఆయన వెంట ఎంఈవో రాజు, ఉపాధ్యాయులు ఉన్నారు.
కామారెడ్డి అర్బన్: కామారెడ్డి మండలం గర్గుల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వి ద్యార్థిని కలిగోట వీణ అండర్–18 జాతీయ హాకీ జట్టుకు ఎంపికయ్యింది. ఇటీవల రాంచీలో నిర్వహించిన సబ్ జూనియర్ నేషనల్ హాకీ చాంపియన్‌షిప్‌లో అద్భుత ప్రతిభ చూపడంతో జాతీయ జట్టుకు ఎంపిక చేశారని పాఠశాల పీఈటీ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఈనెల 19 నుంచి భోపాల్‌లో నిర్వహించే ఇండియన్ టీం క్యాంప్‌లో పాల్గొటుందని పేర్కొన్నారు. అనంతరం జపాన్‌లో నిర్వహించే సబ్ జూనియర్ అండర్ –18 ఆసియా కప్ హాకీ పోటీల్లో భారత జట్టు తరఫున పాల్గొంటుందని పేర్కొన్నారు.
కామారెడ్డి అర్బన్: ఫైర్ సేఫ్టీపై అవగాహన కల్పించడం కోసం బుధవారం ఉదయం 7 గంటలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు 3కే రన్ నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఫైర్ అధికారి ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు, విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు.
కామారెడ్డి టౌన్ : ప్రజా పాలన –ప్రగతి ప్రణాళిక కార్యాచరణ అమలుపై కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈనెల 16న నిర్వహించనున్న మండల స్థాయి సమావేశాల సంసిద్ధత గురించి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో సమావేశాలను అత్యంత సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు మేలు జరిగేలా చూడాలని ఎంపీడీవోలకు సూచించారు. సమావేశాల పర్యవేక్షణ బాధ్యతను జెడ్పీ సీఈవో చందర్‌నాయక్‌కు అప్పగిస్తూ, అన్ని మండలాల నుంచి నివేదికలు సేకరించి జిల్లా స్థాయి సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ప్రజా పాలన ప్రగతి సమావేశాలు సజావుగా సాగేందుకు మండల ప్రత్యేక అధికారులను ‘నోడల్ అధికారులు’గా నియమించామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, జెడ్పీ సీఈవో చందర్, సీపీవో రఘునందన్ పాల్గొన్నారు.
నేడు మంత్రి పొన్నం రాక
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ బుధవారం నిజామాబాద్‌కు రానున్నారు. ఆయన మధ్యాహ్నం 2.45 గంటలకు జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. రవాణా శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ‘అరైవ్ – అలైవ్’ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ గ్రౌండ్ నుంచి డీఎస్ చౌరస్తా వరకు బైక్ ర్యాలీ, చౌరస్తాలో మానవహారం ఏర్పాటు చేయనున్నారు. అనంతరం సుగుణ గార్డెన్స్‌లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఖలీల్‌వాడి(నిజామాబాద్ అర్బన్): తెలంగాణ మోడల్ పాఠశాలల ప్రవేశ పరీక్ష ఈనెల19న నిర్వహించనున్నట్లు నిజామాబాద్ డీఈవో పార్శి అశోక్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం ఆరో తరగతి, మధ్యాహ్నం ఏడో తరగతి విద్యార్థులకు పరీక్ష ఉంటుందని అన్నారు. ప్రవేశ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు సంబంధిత వెబ్‌సైట్ నుంచి హాల్ టిక్కెట్‌లను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9391266444 నంబర్‌ను సంప్రదించాలన్నారు.


