‘‘ఒక్కగానొక్క కొడుకు.. పేదరికంలో ఉన్నా బీడీలు చుడుతూ చదివించుకున్న. టెట్ రాసి డీఎస్సీ కోసం ఎదురు చూస్తుండె. అప్పటిదాకా ఖాళీగా ఎందుకు అని కామారెడ్డిలో ఓ ప్రైవేటు ఉద్యోగానికి పోయేటోడు. ఆ రోజు కూడా పోయి వస్తానని చెప్పి ఇంటి నుంచి బైక్ మీద బయలుదేరిండు. అవే చివరి మాటలు.. 10 నిమిషాల్లోనే ఫోన్ వచ్చింది మీ కొడుకు ట్రాక్టర్ ఢీకొట్టడంతో చనిపోయిండని’’ అని బీబీపేటకు చెందిన కళావతి పేర్కొంది. హెల్మెట్ ఉంటే బతికెటోడని అన్నారన్నారు. అరైవ్ అలైవ్‌లో భాగంగా రోడ్డు ప్రమాదాల బాధిత కుటుంబాల వారిని పిలిపించి మాట్లాడించారు. ఈ సందర్భంగా కళావతి మాట్లాడుతూ ‘‘ఇక్కడున్న వారంతా నా కొడుకు లాంటి వారే.. హెల్మెట్ పెట్టుకోండయ్యా, తాగి బండి నడపకండయ్యా’’ అంటూ ఆమె విలపించడం అక్కడున్న వారందరినీ కలచివేసింది.


