కామారెడ్డి టౌన్ : జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయ ఆవరణలో అంబేడ్కర్ జయంతి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశ ప్రజల హక్కులను పరిరక్షించడంలో రాజ్యాంగంలోని ప్రతి ఆర్టికల్ కీలక పాత్ర పోషిస్తోందన్నారు. సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంబేడ్కర్ చేసిన పోరాటం చిరస్మరణీయమన్నారు. ఆయన బాటలో నడవాలన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ ఉమారాణి, అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, తహసీల్దార్ హిమబిందు, వివిధ శాఖల అధికారులు, దళిత సంఘాల ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


