సదాశివనగర్: రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత అని డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కుప్రియాల్ గ్రామ శివారులోని 44వ నంబర్ జాతీయ రహదారిపై గల యాక్సిడెంట్ బ్లాక్ స్పాట్‌ను ఆయన పరిశీలించారు. ప్రమాదాల నివారణకు చేపట్టాల్సిన చర్యలను వివరించారు. మూడేళ్లలో ఈ చౌరస్తా వద్ద 12 మంది మృతి చెందినట్లు పోలీసులు వివరించారు. గతేడాది నవంబర్ నుంచి ఇప్పటివరకు ఈ ప్రాంతంలో ఒక్క ప్రమాదం కూడా జరగలేదన్నారు. ఈ విషయంలో పోలీస్ శాఖ, హైవే అధికారులు సమన్వయంతో తీసుకున్న భద్రతా చర్యలను డీజీపీ అభినందించారు. కార్యక్రమంలో డీఎస్పీ శ్రీనివాస్‌రావు, సీఐ సంతో ష్‌కుమార్, ఎస్సై పుష్పరాజ్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.


