అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభం

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

ఎల్లారెడ్డిలో నివాళులర్పిస్తున్న

ఫైర్‌ ఆఫీసర్‌ వినోద్‌

మద్నూర్‌లో వారోత్సవాలను

ప్రారంభిస్తున్న అధికారులు

మద్నూర్‌(జుక్కల్‌): తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ వారోత్సవాలు మంగళవారం ప్రారంభవుయ్యాయి. వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రంలోని స్టేషన్‌ఫైర్‌ అధికారులు పనిముట్లకు పూలమాలలు వేశారు. లీడింగ్‌ ఫైర్‌మాన్‌ నర్సింలు మాట్లాడుతూ.. 1946 ఏప్రిల్‌14న ముంబై ఓడరేవులో ఘోర అగ్ని ప్రవూదం సంభవించిందని, మంటలు ఆర్పే ప్రయత్నంలో 46 మంది ఫైర్‌ సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని ఆ రోజు నుంచి ఏప్రిల్‌ 14 నుంచి 20 వరకు అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తారన్నారు.

ఎల్లారెడ్డిలో అగ్నిమాపక వారోత్సవాలు

ఎల్లారెడ్డిరూరల్‌: ఎల్లారెడ్డి అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మంగళవారం అగ్నిమాపక వారోత్సవాలను ఫైర్‌ ఆఫీసర్‌ వినోద్‌ ప్రారంభించారు. వారోత్సవాలలో భాగంగా అగ్నిమాపక జెండాను ఎగరవేశారు. అనంతరం అగ్ని ప్రమాదాలలో అమరులైన సిబ్బందికి నివాళులర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement