నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధర్మారెడ్డి గ్రామంలో చిన్నఆత్మకూర్ గ్రామ సర్పంచ్ మిద్దింటి అనితతో పాటు సుమారు 50 మంది మంగళవారం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఎమ్మెల్యే వారికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శ్రీధర్‌గౌడ్, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు మురళీమోహన్‌గౌడ్, నాయకులు లచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.
లింగంపేట(ఎల్లారెడ్డి): అయిలాపూర్‌లో గౌడ సంఘం ఆధ్వర్యంలో ఎల్లమ్మకు బోనాలు ఊరేగించారు. ఈ సందర్భంగా గౌడ కులస్తులు ఇంటింటికి బోనం తీసుకొని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. శోభాయాత్ర సందర్భంగా పోతరాజుల విన్యాసాలు అందరినీ ఆకట్టుకున్నాయి. అనంతరం ఎల్లమ్మ ఆలయం చుట్టూ ఐదుసార్లు బోనాలు ప్రదర్శించి అమ్మవారికి సమర్పించారు. మొక్కులు తీర్చుకొని ప్రత్యేక పూజలు చేశారు.


