అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుద్దాం | - | Sakshi
Sakshi News home page

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుద్దాం

Apr 15 2026 7:32 AM | Updated on Apr 15 2026 7:32 AM

అంబేడ్కర్‌ అడుగుజాడల్లో నడుద్దాం

మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే

బిచ్కుంద(జుక్కల్‌): బాబాసాహెబ్‌ అంబేడ్కర్‌ అడుగు జాడలో నడిచి ఆయన ఆశయ సాధనకు అందరు కృషి చేద్దామని మాజీ ఎమ్మెల్యే హన్మంత్‌ సింధే అన్నారు. మంగళవారం అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని బిచ్కుందలో విగ్రహానికి పూల మాలలు వేసి నివాళిలు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంబేడ్కర్‌ అందరివాడు అన్ని వర్గాల అభివృద్ధి, దేశ ప్రగతికి ఎంతో కృషి చేశారని అన్నారు. ఆయన రాసిన రాజ్యాంగం వల్ల అందరికీ హక్కులు లభించాయని, కులవ్యవస్ధ నిర్మూలనకు ఎంతో కృషి చేశారని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement