సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

సనాతన ధర్మంలో కుల వ్యవస్థ లేదు

భద్రాచలం పీఠాధిపతి

విశ్వాత్మానంద గిరి స్వామీజీ

బాన్సువాడలో ఘనంగా

హిందూ సమ్మేళనం

బాన్సువాడ : సనాతన ధర్మంలో కులవ్యవస్థ లేదని భద్రాచలం పీఠాధిపతి విశ్వాత్మానంద గిరి స్వామీజీ పేర్కొన్నారు. బాన్సువాడలో పాత బాన్సువాడ బస్తీ ఆధ్వర్యంలో శ్రీ వీరమాత జిజియాబాయి హిందూ సమ్మేళనం నిర్వహించారు. సమ్మేళనంలో స్వామీజీ మాట్లాడుతూ హిందుత్వం ఆచరించదగ్గ జీవన విధానమన్నారు. ప్రపంచంలో ఏ దేశంలో కూడా విడగొట్టే శక్తులు లేవని, కానీ భారతదేశంలోనే మానవులను విడగొట్టే శక్తులున్నాయని పేర్కొన్నారు. దేశాన్ని ముక్కలుగా చేసి రాజకీయం చేస్తున్నాయన్నారు. విగ్రహాలను ధ్వంసం చేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సనాతన ధర్మ పరిరక్షణకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువకులు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. రాముడిని మొక్కడం మాత్రమే కాదని, ఆయనలా బతకాలి అనే భావన అందరిలో రావాలని పేర్కొన్నారు. హిందువులు ఎక్కువ మంది పిల్లలను కనాలని సూచించారు. కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తెలంగాణ ప్రాంత కార్యవాహ కాచం రమేశ్‌, పాత బాన్సువాడ బస్తీ కమిటీ అధ్యక్షులు ఉమ మహేష్‌, ప్రధాన కార్యదర్శి గుడాల నగేశ్‌, సభ్యులు వేదప్రకాశ్‌, దేఖల సాయిలు, గాజుల రాజులు, నాయకులు కాసుల రోహిత్‌, పాశం భాస్కర్‌రెడ్డి, గడ్డమీది అంజాగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement