● కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి
భిక్కనూరు: పేదల సొంతింటి కలను నేరవేర్చిన ఘనత సీఎం రేవంత్‌రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాజంపేట మండలం శివ్వాయిపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. లబ్ధిదారులకు సీఎం రేవంత్‌రెడ్డి ఫొటోతోపాటు నూతన వస్త్రాలను బహూకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ద్వారా నిరుపేదలకు అండగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ముందున్నారన్నారు. సొంత స్థలం లేని వారికి ఇళ్ల నిర్మాణం కోసం త్వరలో ప్రభుత్వం ఒక ప్రకటన చేస్తుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య బాల్‌రాజు, నేతలు ఆనంద్‌రావు, జూలురి సుధాకర్, మామిళ్ల అంజయ్య, గడ్డమీది మహేశ్, పంపరి శ్రీనివాస్, పంపరి లక్ష్మణ్, సలీం, చాట్ల వంశి, రవీందర్‌గౌడ్, శ్రీధర్, బండారి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


