ఈసారి మంచి దిగుబడి వచ్చింది. నాకై తే ఎకరాకు 50 క్వింటాళ్లు వచ్చాయి. ప్రభుత్వం వెంటనే మక్క కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ఎకరాకు 25 క్వింటాళ్ల నిబంధన ఎత్తివేసి, రైతులు పండించిన పంట మొత్తం కొనాలి.
– తక్కల నర్సారెడ్డి, రైతు,
రామేశ్వర్‌పల్లి, భిక్కనూరు మండలం
మక్క కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో దళారులకు అమ్ముకోవాల్సి వస్తోంది. వారు తక్కువ ధరకు కొంటున్నారు. దీంతో ఎకరాకు రూ. 20 వేల వరకు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి.
– బాపురావ్, రైతు, తాడ్వాయి


