బాన్సువాడ రూరల్/బాన్సువాడ: నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇండ్ల పురోగతిపై సోమవారం రాష్ట్ర వ్యవసాయశాఖ సలహాదారు పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన నివాసంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పోచారం మాట్లాడుతూ.. ఇండ్ల నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా క్షేత్రస్థాయిలో లబ్ధిదారులను ప్రోత్సహించాలన్నారు. సమస్యలు ఉంటే ఉన్నతాధికారుల దృష్టికి తేవాలన్నారు. నాణ్యత లోపించకుండా పర్యవేక్షిస్తూ, బిల్లుల చెల్లింపు విషయంలో బాధ్యతగా వ్యవహరించాలన్నారు. జూన్ నెలాఖరు కల్లా నిర్మాణాలు పూర్తయ్యేలా చూడాలని, పూర్తయిన ఇండ్లకు వెన్వెంటనే గృహప్రవేశాలు చేయాలన్నారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, స్టేట్ ఆగ్రోస్ చైర్మన్ కాసుల బాలరాజు, ఏఎంసీ చైర్మన్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.


