ఆల్ప్రాజోలం పట్టివేత | - | Sakshi
Sakshi News home page

ఆల్ప్రాజోలం పట్టివేత

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

ఇద్దరు నిందితుల అరెస్టు

ఎల్లారెడ్డి: నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫ్రాజోలంను విక్రయించేందుకు యత్నించిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎల్లారెడ్డి సీఐ రాజిరెడ్డి సోమవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన పులి రమేశ్‌ తన స్నేహితుడైన ఓలెపు రమేశ్‌, మధ్యవర్తి హసన్‌పల్లి అనిల్‌కుమార్‌ ద్వారా తిమ్మాపూర్‌ గ్రామానికి చెందిన చేపర్తి ఈశ్వర్‌గౌడ్‌కు ఆల్ప్రాజోలంను విక్రయించేందుకు రూ.5 వేలకుఒప్పందం చేసుకున్నారు. ఈ నెల 11న సాయంత్రం పులి రమేశ్‌ సూచనల మేరకు కొనుగోలుదారుకు సాంపిల్‌ చూపించేందుకు 101 గ్రాముల మత్తు పదార్థాన్ని తీసుకొని ఓలెపు రమేశ్‌, అనిల్‌ కుమార్‌ గండిమాసానిపేట గేట్‌ వద్దకు బైక్‌పై వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు నిందితులను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని 101 గ్రాముల ఆల్ఫాజ్రోలంను స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు పులి రమేశ్‌ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement