నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ఇందిరమ్మ ఇంటి పథకం నిరుపేదల పాలిట వరంలా మారిందని తెలంగాణ రాష్ట్ర విత్తన సంస్థ చైర్మన్ అన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. నాగిరెడ్డిపేట మండలంలోని వెంకంపల్లిలో సోమవారం ఏలేటి యాదమ్మకు చెందిన ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ జ్యోతిరెడ్డితో కలిసి ఇందిరమ్మ ఇంటిని ఆయన ప్రారంభించారు. ఆయన వెంట ఆత్మకమిటీ చైర్మ న్ దశరథ్ నాయక్, డైరెక్టర్ దివిటీ కిష్టయ్య, కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు రాంచందర్ రెడ్డి, నాగిరెడ్డిపేట ఎంపీడీవో ప్రవీణ్ కుమార్, పంచాయతీ కార్యదర్శి రజిత తదితరులు పాల్గొన్నారు.


