మద్నూర్(జుక్కల్): డోంగ్లీ నూతన తహసీల్దార్‌గా బాధ్యతలు చేపట్టిన రంజిత్‌కుమార్ ప్రజలకు ఇబ్బందులు లేని పరిపాలన అందించాలని గ్రామస్తులు కోరారు. డోంగ్లీ తహసీల్ కార్యాలయంలో సోమవారం గ్రామానికి చెందిన పలువురు నూతన తహసీల్దార్‌కు శాలువాతో సన్మానించి స్వాగతం పలికారు. ప్రజలకు అవసరమైన ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందించాలని యువ నాయకుడు ప్రవీణ్‌కుమార్ కోరారు. డోంగ్లీ మండలంలోని సమస్యలు తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.


