బాన్సువాడ : బాన్సువాడ మాత శిశు సంరక్షణ ఆస్పత్రి(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న వారికి వేసవి కష్టాలు మొదలయ్యాయి. పలు విభాగాల్లో ఏసీలు పని చేయకపోవడంతో కూలర్లు పెట్టి నెట్టుకొస్తున్నారు. ఎండ వేడికి, ఉక్కపోతతో ఇన్ పేషంట్లు విలవిల్లాడిపోతున్నారు. ప్రస్తుతం జిల్లాలో ఉష్ణాగ్రతలు తీవ్రంగా నమోదయ్యాయి. ఇది మరింత పెరిగే అవకాశం ఉండటంతో అసలే అరోగ్యం బాగా లేక చికిత్స కోసం వచ్చే వారు మరింత ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది.
అవార్డుతోనే సంతృప్తి..
ఈ నెల 7న బాన్సువాడ ఎంసీహెచ్‌కు రాష్ట్ర స్థాయి లో అత్యధిక సాధారణ కాన్పులు చేసిన ఆస్పత్రిగా ఉత్తమ అవార్డు వచ్చింది. అవార్డును మంత్రి దా మోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్ అందుకున్నా రు. అవార్డు రావడం ఆనందమే అయినా క్షేత్రస్థాయిలో వసతుల కల్పనలో మాత్రం ఆ పరిస్థితులు లేవనే విమర్శలున్నాయి.బాన్సువాడ ఆస్పత్రికి బా న్సువాడ,జుక్కల్,ఎల్లారెడ్డి నియోజకవర్గాల నుంచే కాకుండా పక్కనే ఉన్న సంగారెడ్డి జిల్లా నారాయణ్‌ఖేడ్, కంగ్టి, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి చి కిత్స కోసం వస్తుంటారు. ఎంబికాలంలో ఏసీలను మరమ్మతు చేయించకపోవడంపై పెదవి విరుస్తున్నారు. జనరల్ ఆస్పత్రి నూతన భవనం నిర్మిస్తుండటంతో మాత శిశు ఆస్పత్రి ప్రాంగణంలోనే రేకుల షెడ్డు వేసి రోగులకు వైద్య సేవలందిస్తున్నారు. అసలే ఎండలు మండిపోతున్నాయి. రేకుల షెడ్డు లో రోగుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకో వచ్చు.ఏసీలు కొన్ని పని చేయకపోవడంతో రోగుల సౌకర్యం కోసం కూలర్లు తెప్పించారు. కానీ కొన్ని వార్డుల్లో రోగుల కోసం తెచ్చిన కూలర్లను వైద్య సిబ్బందే వాడుకుంటున్నారు.దీంతో రోగులు ఉక్క పోత,ఎండ వేడితో ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి స్థాయిలో ఏసీలు లేక బాలింతలు, గర్భిణు లు, చిన్నారులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. భా నుడు మరింత ప్రతాపం చూపకముందే పూర్తి స్థా యిలో ఏసీలను మరమ్మతులు చేయించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ విజయభాస్కర్‌ను వివరణ కోసం ప్రయత్నించగా ఆయన స్పందించలేదు.
ఎంసీహెచ్‌లో చికిత్సకు వచ్చిన
వారికి కష్టాలు
పలు విభాగాల్లో ఏసీలు పని చేయక కూలర్లు తెచ్చిన వైనం
రోగుల కోసం తెచ్చిన కూలర్లను వాడుకుంటున్న వైద్య సిబ్బంది
మండే ఎండలతో అల్లాడుతున్న
ఇన్ పేషంట్లు


