నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

నిబంధనల ప్రకారమే ధాన్యం కొనుగోళ్లు

Apr 14 2026 7:46 AM | Updated on Apr 14 2026 7:46 AM

నిజాంసాగర్‌(జుక్కల్‌): ప్రభుత్వ నిబంధన ప్రకారమే వరి ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని అదనపు కలెక్టర్‌ విక్టర్‌ అన్నారు. సోమవారం గోర్గల్‌ గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు. మరి ధాన్యంలో తాలు లేకుండా, తేమ శాతం ఉండేలా చూసుకోవాలని కేంద్రం నిర్వాహకులకు సూచించారు. నిబంధన ప్రకారం ధాన్యం సేకరించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఆయన వెంట సివిల్‌ సప్లై డీఎం, నాయకులు తదితరులున్నారు.

కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించాలి

కామారెడ్డి రూరల్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతులు ధాన్యం విక్రయించి ప్రభుత్వం కల్పిస్తున్న మద్దతు ధర పొందాలని సర్పంచ్‌ గుర్రాల లక్ష్మి సూచించారు. సోమ వారం తిమ్మక్‌పల్లిలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రా రంభించారు.ఉప సర్పంచ్‌ గొర్రె పరమేష్‌, ఏపీఎం శ్రీనివాస్‌, పాలకవర్గ సభ్యులు, సీసీలు, మహిళా సంఘాల అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement