ఎడ్యుకేషన్ హబ్ కలేనా?
జిల్లా కేంద్రం ఎడ్యుకేషన్ హబ్‌గా మారితే జిల్లాలోని విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే ఉన్నత చదువులు, వారికి నచ్చిన కోర్సులు చదివే అవకాశం ఉంటుంది. కానీ ఏళ్లు గడిచినా నేతల హామీలు అమలుకాకపోవడంతో ‘ఎడ్యుకేషన్ హబ్’ కలగానే మిగిలిపోతుంది.
– సాక్షి ప్రతినిధి, కామారెడ్డి
ఏడు దశాబ్ధాల చర్రిత ఉన్న కామారెడ్డి ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ కేంద్రంగా జిల్లాను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామన్న నేతల హామీలు ఆచరణకు నోచుకోవడం లేదు. సరైన ప్రయత్నాలు జరగకపోవడం మూలంగా ఎడ్యుకేషన్ హబ్ అనేది కలగానే మిగిలిపోయింది.
ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో డిగ్రీతో పాటు పీజీ కోర్సులు ఉండగా, వందలాది మంది చదువుతున్నారు. అలాగే స్థానికంగా ఉన్న ప్రైవేటు డిగ్రీ కాలేజీలలో కూడా వందలాది మంది చదువుతున్నారు. కానీ ఉన్నత చదువులకు సంబంధించిన కళాశాలలు స్థానికంగా లేకపోవడంతో హైదరాబాద్‌కు వెళ్లాల్సి వస్తోంది. స్థానికంగా ఉన్నత విద్యా సంస్థలు ఏర్పాటైతే ఈ ప్రాంత విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
కామారెడ్డిలో పాలిటెక్నిక్, ఐటీఐ కాలేజీల ఏర్పాటుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. చుట్టుపక్కల ప్రాంతాల్లో వందలాది మంది విద్యార్థులు ఇతర ప్రాంతాలకు వెళ్లి చదువుకుంటున్నారు. ఇక్కడే ఆయా కాలేజీలు ఉండి వుంటే ఎంతో మేలు జరిగేది. రాష్ట్ర ప్రభుత్వం ఐటీఐలను ఏటీసీలుగా అభివృద్ధి చేస్తోంది. ప్రభుత్వ కళాశాల ప్రాంగణంలో ఏటీసీ ఏర్పాటు చేస్తే ఎంతో మంది చదువుకునే అవకాశం కలుగుతుంది. అలాగే ఉపాధ్యాయ విద్యకు సంబందించి బీఎడ్, డీఎడ్ కోర్సులకు సంబందించిన ప్రభుత్వ కాలేజీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. పేద, మద్య తరగతి విద్యార్థులు ప్రైవేటు కాలేజీల్లో ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంంటున్నారు.
అప్పట్లోనే తరలిపోయిన
ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీ
మెడికల్ కాలేజీ వచ్చినా
నర్సింగ్ కాలేజీ రాకపాయె...
మంజూరుకు నోచుకోని
డెయిరీ పీజీ కోర్సులు
పాలిటెక్నిక్, ఐటీఐల ఏర్పాటు
హామీలకే పరిమితం


