దడ పుట్టిస్తున్న దోపిడీలు
జాగ్రత్తలు పాటించాలి..
కామారెడ్డి క్రైం: రాత్రివేళల్లో తాళం వేసిన ఇళ్లను దుండగులు టార్గెట్ చేసి చోరీలకు పాల్పడే ఘటన లే ఇదివరకు ఎక్కువగా కనిపించేవి. కానీ ప్రస్తుతం రాత్రిపగలు తేడాలేకుండా ఎప్పుడు, ఎక్కడ డబ్బు, బంగారం కనిపించినా చోరీలకు పాల్పడుతున్నా రు. జిల్లాలో కొన్నిరోజులుగా వరుసగా దోపిడీ ఘ టనలు వెలుగుచూస్తుండటంతో ప్రజల్లో దడపుట్టిస్తున్నాయి.
పెరుగుతున్న కేసులు..
కామారెడ్డి జిల్లాలో 2024లో దోపిడీ ఘటనలు 15 జరిగాయి. కానీ గతేడాది 35 దోపిడీ ఘటనలు వె లుగు చూశాయి. ఇవి కాకుండా సొత్తు చోరీ కోసం జరిగిన హత్య కేసులు మరో 5 ఉన్నాయి. ఈయేడా ది ప్రారంభం నుంచి కూడా దోపిడీల సంఖ్య పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. దాడులు, చైన్ స్నాచింగ్ లు, దోపిడీ ఘటనలు తరచుగా వెలుగుచూస్తుండటమే ఇందుకు ఉదాహరణ. గత నెల దోమకొండ లోని ఓ ఇంట్లోకి అర్ధరాత్రి దొంగలు చొరబడి, ఏకంగా కత్తులతో బెదిరించి దోపిడీకి పాల్పడిన విష యం తెలిసిందే. ఇంట్లో అందరూ ఉండగానే చొ రబడటం, దాడులు చేయడం కలకలం రేపింది. అలాగే దేవీవిహార్ సమీపంలో జరిగిన చైన్ స్నాచింగ్ ఘటనలో భర్త వెంట ఉన్నా కూడా దుండగులు రన్నింగ్‌లోనే మహిళ మెడలోంచి చైన్ లాక్కొని పరారవడం విస్మయానికి గురిచేసింది. ఇలాంటి ఘటనలను బట్టి చూస్తే నేరగాళ్ల సంఖ్య, నేర ప్రవృత్తి పెరుగుతున్నట్లే కనిపిస్తుంది. ప్రయాణాల్లో, ఒంటరిగా ఉన్నప్పుడు, డబ్బు, నగదు వెంటబెట్టుకుని ఎక్కడికై నా వెళ్లే సందర్భాల్లో తగిన జాగ్రత్తలు పాటించాలని, అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సైతం సూచిస్తున్నారు.
ఇటీవల జరిగిన ఘటనలు..
● బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామానికి చెందిన యాదవ రావు వారం రోజుల క్రితం బాన్సువాడ లోని ఓ బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకుని కారు లో ఇంటికి బయలుదేరాడు. ఓ షాపింగ్‌మాల్ ముందు కారును నిలిపి సామగ్రి కొందామని లోనికి వెళ్లాడు. అప్పటికే అతడిని అనుసరిస్తున్న దుండగుడు కారు అద్దాలు పగులగొట్టి క్షణాల్లో రూ.8 లక్షలు దోచుకువెళ్లాడు. ఇప్పటికీ నిందితు డి ఆచూకీ దొరకలేదు.
● కామారెడ్డి మండలం చిన్నమల్లారెడ్డి గ్రామానికి చెందిన కమ్మరి శ్రీనివాస్, అనంతలక్ష్మీ దంపతు లు ఈ నెల 21న రాత్రి బైక్‌పై తాడ్వాయికి వెళుతుండగా ఇద్దరు దుండగులు వారిని ఫాలో అ య్యారు. జిల్లా కేంద్రంలోని దేవీవిహార్ దాటగా నే ప్రధాన రహదారిపై మరో బైక్‌పై వెనుక నుంచి వచ్చి అనంతలక్ష్మీ మెడలోని 3 తులాల బంగారం గొలుసు లాక్కొని ఉడాయించారు. ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలు అయ్యాయి.
● కామారెడ్డిలోని పాత ఎస్పీర్ కాలనీలో ఈనెల 16న ఓ వింతైన ఘటన వెలుగుచూసింది. ముసుగులు ధరించిన ముగ్గురు దుండగులు ఓ తాళం వేసిన ఇంట్లో చోరీ చేసే క్రమంలో ఏకంగా బీరువానే భుజాలపై ఎత్తుకుని పరారయ్యారు. దొంగల ఆచూకీతో పాటు ఇప్పటికీ బీరువా ఆచూకీ కూడా లభించలేదు.
● పట్టణంలోని కల్కినగర్‌లోని ప్రధాన రహదారి వెంబడి గత నెల ఓ దారి దోపిడీ ఘటన జరిగింది. మహారాష్ట్రకు చెందిన ఓ లారీ డ్రైవర్ రోడ్డు పక్కన ఆపి వంట చేసుకుంటుండగా కొందరు యువకులు అక్కడకు వచ్చి డ్రైవర్‌ను బెదిరించి సెల్‌ఫోన్, నగదును దోచుకుని పరారయ్యారు.
అనుమానాస్పద వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఒంటరిగా ఉండేవారు, ప్రయాణించే వారు, మహిళలు తగిన జాగ్రత్తలు పాటించాలి. నేరాల నియంత్రణకు పోలీసు శాఖ తరఫున అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దొంగలు, దోపిడీలు చేసే నేరగాళ్లపై ప్రత్యేక నిఘా ఉంచాం.
– నరహరి, ఎస్‌హెచ్‌వో, కామారెడ్డి
నేరాల బాట పడుతున్న వారిలో యువకులే ఎక్కువగా ఉంటున్నారు. చెడు వ్యసనాల బారిన పడి ఈజీ మనీ కోసం దోపిడీలకు వెనుకాడటం లేదు. ఈ కారణంగానే జిల్లాలో దోపిడీ ఘటనలు పెరుగుతున్నట్లు తెలుస్తుంది. జరిగిన ఘటన, నేరానికి పాల్పడిన వారి సంఖ్య, కేసు తీవ్రతను బట్టి దోపిడీ, దారి దోపిడీ, చైన్‌స్నాచింగ్, డెకాయిట్ అంటూ వేర్వేరుగా వివిధ సెక్షన్‌ల కింద పోలీసులు కేసులను నమోదు చేస్తుంటారు. ఇలాంటి నేరాల నియంత్రణకు పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా తరచుగా జరుగుతూనే ఉన్నాయి.
జిల్లాలో వెలుగు చూస్తున్న
వరుస ఘటనలు
రాత్రిపగలు తేడాలేకుండా
చోరీలకు పాల్పడుతున్న దుండగులు
డబ్బు, బంగారం కనిపిస్తే దాడులే
దడ పుట్టిస్తున్న దోపిడీలు


