లక్ష్యంతో ముందుకు వెళ్తేనే బంగారు భవిష్యత్తు
భిక్కనూరు: విద్యార్థులు లక్ష్యంతో ముందుకు వెళ్తేనే భవిష్యత్తు బంగారుమయంగా ఉంటుందని, నిరంతరం పుస్తక పఠనంతో ఉత్తమ పలితాలు సాధిస్తారని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అన్నారు. రాజంపేట మండలంలోని కొండాపూర్ గ్రామాన్ని బుధవారం ఆయన సందర్శించారు. సీఎస్‌ఆర్ ఫౌండేషన్ సహకారంతో బడిలో ఏర్పాటు చేసిన గ్రంథాలయంను ఆయన ప్రారంబించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు గణితంలో ప్రశ్నలు అడిగి సమాధానాలను రాబట్టారు. విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించి అభినందించారు. అంతకుముందు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణపనులను పరిశీలించి, పనులు వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. అనంతరం ఆరోగ్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేశారు. సిబ్బందికి ఇబ్బందులను తెలుసుకుని వెంటనే పరిష్కరించాలని జిల్లా వైద్యాధికారి రవీందర్‌గౌడ్‌కు సూచించారు. కొండాపూర్ గుండారం ఆర్గోండ గ్రామలకు సంబందించిన పీహెచ్‌సీ ఎర్రాపహడ్ ఉండడంతో ఇబ్బంది కలుగుతుందని ప్రజలు ఫిర్యాదు చేయడంతో రాజంపేట పీహెచ్‌సీకి మార్చాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. హౌజింగ్ పీడీ విజయపాల్‌రెడ్డి, డీఈవో రాజు, ఎంపీడీవో బాలక్రిష్ణ, ఎంఈవో పూర్ణ చందర్‌రావు, హెచ్‌ఎం వెంకటేశ్వరులు, డిప్యూటీ డీఎంహెచ్‌వో రామిరెడ్డి, వైద్యుడు ఖాసీం పాల్గొన్నారు.


