15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని
● పరీక్షకు అనుమతి ఇవ్వని అధికారులు
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని రాంసుఖ్ బాల్‌ముకుంద్ ఇనాని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం నిర్వహించిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షకు మండలంలోని పెద్ద ఎక్లార గేటు వద్ద గల సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలకు చెందిన ఎంపీసీ ఫస్టియర్ విద్యార్థిని ఆశ్విని 15 నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారుల అనుమతించలేదు. పరీక్ష కేంద్రానికి బైక్‌పై వస్తుండగా మధ్యలో బైక్ చెడిపోవడంతో ఆలస్యమైందని విద్యార్థిని తెలిపారు. నిబంధనల ప్రకారం కేవలం ఐదు నిమిషాల వరకే అనుమతి ఉందని అధికారులు చెప్పడంతో ఆ విద్యార్థిని బాధతో ఇంటికి వెళ్లిపోయింది. ఈ విషయమై కళాశాల ప్రిన్సిపాల్ స్వప్నను సంప్రదించగా సదరు విద్యార్థిని ఆమె బంధువులతో కలిసి బైక్‌పై పరీక్ష కేంద్రానికి వెళ్లిందన్నారు. ఆశ్విని కళాశాలకు కొన్ని రోజులుగా రాకపోవడంతో పరీక్ష కేంద్రానికి సకాలంలో హాజరుకావాలని ముందే తెలియజేశామన్నారు.
15 నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థిని


