శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం | - | Sakshi
Sakshi News home page

శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం

Feb 22 2026 8:12 AM | Updated on Feb 22 2026 8:12 AM

శ్మశా

శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం

బీబీపేట : ఎన్నికల సమయంలో గ్రామానికి ఇచ్చిన మాట ప్రకారం శ్మశాన వాటిక కోసం 10 గుంటల భూమిని బీబీపేట్‌ సర్పంచ్‌ ఏదుళ్ల సాద్విక సాయినాథ్‌ శనివారం జీపీ పాలకవర్గానికి అధికారికంగా అప్పగించా రు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రా మంలో అంత్యక్రియలు చేసేందుకు గుంట భూమి లేని వారు చాలా మంది ఉన్నారని వారిని దృష్టిలో ఉంచుకొని భూమిని విరాళంగా ఇచ్చామన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్‌ చందుపట్ల ప్రశాంత్‌ కుమార్‌, సెక్రెటరీ రమేశ్‌, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై

దాడి అమానుషం

బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు

యెండల లక్ష్మీనారాయణ

భిక్కనూరు: కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి క్యాంప్‌ కార్యాలయంపై కాంగ్రెస్‌ శ్రేణులు దాడి చే యడం అమాను షం అని బీజేపీ రా ష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. ఘటనపై ఎమ్మెల్యే కేవీఆర్‌ను పరామర్శించేందుకు శనివారం ఆయన హైదరాబాద్‌ నుంచి బయలుదేరాడు. భిక్కనూరు టోల్‌గేట్‌ వద్ద పోలీసులు ఆయనను అరెస్టు చేసి, స్థానిక పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం సొంత పూచికత్తుపై పో లీసులు ఆయనను వదిలిపెట్టారు. ఈసందర్భంగా యెండల మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ నేతలు అధికారం ఉందని విర్రవీగితే ప్రజ లు చూస్తూ ఊరుకోరని కర్రు కాల్చి వాత పె డుతారని అన్నారు. బాన్సువాడలో జరిగిన విధ్వంసానికి యువతిని వేధించిన వ్యక్తియే కారణమని, ఆయన ప్రభుత్వాస్పత్రిలో ఉ ద్యోగిగా ఉంటూ ఒక మతాన్ని కించపరిచి నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదన్నారు. బీజేపీ మండలాధ్యక్షుడు ఉప్పరి రమేష్‌, నేతలు రమేష్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

కాంగ్రెస్‌ బలోపేతానికే శిక్షణ శిబిరం

నిజాంసాగర్‌(జుక్కల్‌): గ్రామ, మండల, జిల్లా స్థాఽయిల్లో కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకే ‘సంఘటన్‌ సృజన్‌ అభియాన్‌’ పేరుతో డీసీసీ అధ్యక్షులకు ప్ర త్యేక శిక్షణ శిబిరం ఏర్పాటు చేశారని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు ఎలే మల్లికార్జున్‌ తెలిపారు. వికారాబాద్‌ జిల్లాలో శనివారం నిర్వహించిన శిబిరం ఆయన పాల్గొన్నట్లు ‘సాక్షి’కి తెలిపారు. ఈ శిక్షణ తరగతులను రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి మీనాక్షినటరాజన్‌, మాణిక్యంఠాగూర్‌తో పాటు ఆల్‌ఇండియా కాంగ్రెస్‌ కమిటి పర్యవేక్షణలో జరగుతుందని చెప్పారు.

మాతృభాష సంరక్షణ

అందరి బాధ్యత

కామారెడ్డి అర్బన్‌: మాతృభాషను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలంగాణ రచయితల వేదిక జిల్లా అధ్యక్షుడు సిరిసిల్ల గఫూర్‌ శిక్షక్‌ అన్నారు. పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘంలో శనివారం తెరవే ఆధ్వర్యంలో మాతృభాష దినోత్సవం నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చే సిన సాహితీ కార్యక్రమంలో పలువురు కవు లు, రచయితలను సన్మానించారు. కవులు కందుకూరి శ్రీనివాస్‌, శ్యాంకుమార్‌, గంగాప్రసాద్‌, రామచంద్రం, నరసయ్య, లింగం, ఫణికుమార్‌, సుధాకర్‌, రాజయ్య ఉన్నారు.

శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం
1
1/2

శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం

శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం
2
2/2

శ్మశాన వాటికకు 10 గుంటల భూమి విరాళం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement