తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధం
● క్యాంపు కార్యాలయంపై దాడి కాంగ్రెస్ శ్రేణుల అరాచకానికి నిదర్శనం
● కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి
కామారెడ్డి టౌన్: తాను తప్పు చేసినట్లు డా క్యుమెంట్లతో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకుంటాన ని కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి బహిరంగ సవాల్ విసిరారు. పట్టణంలో శనివారం జరిగిన ఉద్రిక్తత అనంతరం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. తన పై వస్తున్న భూ అవినీతి ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ నేతల తీరుపై నిప్పు లు చెరిగారు. చర్చకు రమ్మంటే వందలాది మందితో వచ్చి తన క్యాంపు కార్యాలయంపై దాడికి యత్నించడం కాంగ్రెస్ నేతల అరాచకానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం కలెక్టర్, రె వెన్యూ కలెక్టర్‌ల సమక్షంలో కళాశాల భూముల విషయంపై చర్చించుకుందామని కాంగ్రెస్ నా యకులకు సవాల్ విసిరారు. తన తప్పు తేలితే ఏ శిక్షకు అయినా సిద్ధమేనన్నారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులను ఎదగనివ్వకుండా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ తొక్కుతున్నారని ఆరోపించారు. గత రెండేళ్లుగా తాను మౌనంగా ఉంటే షబ్బీర్ అలీ ఈ నియోజకవర్గానికి నవాబులా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సహకారంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఈ సందర్భంగా గుర్తుచేశారు. జిల్లా కేంద్రంలోని ఆ యన ఐదంతస్తుల ఇంటికి మున్సిపల్ అనుమ తి లేదని, తనను అవినీతిపరుడని అనడం వి డ్డూరంగా ఉందన్నారు. శాంతిభద్రతల దృష్ట్యా పోలీసులు కోరినందుకే తాను బయటకు రాలేదని, కానీ కాంగ్రెస్ నేతలు ఉద్దేశపూర్వకంగానే ఘర్షణకు దిగారని ఆరోపించారు. తనపై గీత పడినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. మున్సిపాలిటీలో తప్పు జరగకుండా చూస్తానన్నందుకే కక్షగట్టి ఈరోజు తనపై దాడికి దిగారన్నారు. రేపటి నుంచి గ్రామాల్లో తిరుగుతానని, ఎవరు అడ్డుకుంటారో చూస్తానని సవాల్ వి సిరారు. తన నిజాయితీ నిరూపించుకునే వరకు ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.


