మందుగుండు పేలి ఆవు మృతి
బోధన్: ఎడపల్లి మండలంలోని జానకంపేట శివారులో గురువారం గుర్తు తెలియని వ్యక్తులు పెట్టిన మందు గుండు పేలి మేతకు వెళ్లిన ఆవు మృతి చెందింది. రెంజల్ మండలం దూపల్లి గ్రామానికి చెందిన కారె సాయికుమార్‌కు చెందిన ఆవును మేతకు కోసం జానకంపేట శివారులో తీసుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అడవి పందుల వేటలో భాగంగా గుర్తు తెలియని వ్యక్తులు పేలుడు మందును పశువుల ఆహార పదార్థం తౌడులో ముద్దగా పెట్టి వదలిపెట్టినట్టు తెలుస్తోంది. ఆ ఆహార పదార్థాన్ని ఆవు తింటుండగా నోట్లో పేలుడు సంభవించి తీవ్రగాయాలపాలైంది. తీవ్రగాయలకు గురైన ఆవు మృతి చెందింది. ఈ ఘటనపై పోలీస్ శాఖ విచారణ చేపట్టి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
కామారెడ్డి టౌన్: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో గుర్తు తెలియని ఓ వృద్ధుడు (65)గురువారం కిందపడి మృతి చెందినట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు. వృద్ధుడు కిందపడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ జిల్లా కేంద్రానికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందాడు. మృతుడి వివరాలు తెలిసిన వారు పోలీసులను సంప్రదించాలని సీఐ కోరారు.


