జాతర ఏర్పాటు పనుల పరిశీలన
దోమకొండ: మండల కేంద్రం శివారులోని గూండ్ల చెరువు వద్ద ఆదివారం జరుగనున్న కటికం మల్లేశుని జాతర ఏర్పాటు పనులను ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మాఘమ అమావాస్య జాతర సందర్భంగా దోమకొండ మండల కేంద్రంతో పాటు వివిధగ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. దీంతో ఆలయ పరిసరాలు పరిశుభ్రం చేయించి ఆలయానికి రంగులు వేశారు. సర్పంచ్ ఐరేని నర్సయ్య, ఉపసర్పంచ్ బొమ్మరి శీనివాస్, వార్డు సభ్యులు బత్తిని సిద్ధిరాములు, పాలకుర్తి శేఖర్, శివరాం మందిర్ దేవస్థానం చైర్మన్ కొండ అంజయ్య, కార్యనిర్వహణ అధికారి ప్రభు, తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ: దోమకొండ సింగిల్ విండో పరిధిలోని ప్రతి రైతు ఈపీఎఫ్‌లో సభ్యత్వం తీసుకోవాలని సొసైటీ కార్యదర్శి బాల్‌రెడ్డి కోరారు. శుక్రవారం మండల కేంద్రంతో పాటు సంగమేశ్వర్ గ్రామానికి చెందిన లోయపల్లి యాదగిరిరావు, లోయపల్లి మంగ, లోయపల్లి లక్ష్మి, గంభీరావ్‌తో పాటు పలువురు రైతులు ఈపీఎస్‌లో సభ్యత్వం తీసుకున్నారు. మిగతా రైతుల సైతం సభ్యత్వం తీసుకొని రైతు ఉత్పత్తిదారుల సంఘంలో చేరాలని ఆయన కోరారు.
బాన్సువాడ: తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు, బాన్సువాడ పురపాలక సంఘ కార్యాలయంలో 19 వార్డులకు సంబంధించిన తుది పోలింగ్ కేంద్రాల జాబితా, పోలింగ్ కేంద్రాల వారీగా తుది ఫోటో ఓటర్ల జాబితాలు శుక్రవారం కమిషనర్ శ్రీహరి రాజు విడుదల చేశారు. కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దోమకొండ: అంచనూరులో శుక్రవారం రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను గ్రామ సర్పంచ్ నరేష్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ కందుకూరి ప్రభాకర్, ఎంపీవో రవికుమార్, పంచాయితీ కార్యదర్శి భానుశ్రీ, వార్డు సభ్యులు జనగామ నవీన్, తెడ్డు స్వప్న, పెద్దగోని గంగవ్వ, నీరడి రాజశేఖర్, పడకంటి రవికుమార్, నర్సవ్వ, గోసంపల్లి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
బాన్సువాడ రూరల్: పండరీపూర్‌లోని రుక్మిణీ విఠలేశ్వర ఆలయానికి పాదయాత్రగా వెళ్తున్న భక్తులకు ఇబ్రహీంపేట్, జక్కల్‌దాని తండా వద్ద గ్రామస్తులు ఘనస్వాగతం పలికారు. వారికి అల్పాహారం అందించారు. బోర్లం మాజీ సర్పంచ్ రూప్‌సింగ్, ఇబ్రహీంపేట్ మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి, పెద్దలు వెంకట్‌రెడ్డి, జెమ్లా నాయక్, భాస్కర్ నాయక్, మాసాని శ్రీనివాస్‌రెడ్డి, అంబర్‌సింగ్, మంత్రి గణేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మద్నూర్(జుక్కల్): మండల కేంద్రంలోని మ ల్లేశ్వర ఆలయంలో గురువారం సంత్ నివృత్తినాథ్ మహరాజ్ సజీవ సమాధి ఉత్సవాన్ని వార్కారీలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని వార్కారీలు, భక్తు లు ఆలయంలో భజనలు, కీర్తనలు చేశారు. ప్ర ముఖ కీర్తనకారుడు సంగాయప్ప కంఠాలికర్ ప్రత్యేక పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. సర్పంచ్ ఉష సంతోష్, గోపాల్, బాలాజీ, విఠల్, గంగారం, తదితరులు పాల్గొన్నారు.
జాతర ఏర్పాటు పనుల పరిశీలన
జాతర ఏర్పాటు పనుల పరిశీలన
జాతర ఏర్పాటు పనుల పరిశీలన


