అంబరాన్నంటిన సంక్రాంతి సంబరాలు
జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. గురువారం సంక్రాంతి పండుగ జరుపుకోగా..శుక్రవారం కనుమ పండుగ చేసుకున్నారు. ఈ సందర్భంగా మహిళలు ఇళ్ల ముందర అందమైన ముగ్గులు వేశారు. రేగుపళ్లు, నవ ధాన్యాలు, చెరుకు గడలు, పూలు, పండ్లు ఏర్పాటు చేసి పాలు పొంగించారు. అనంత రం పూజలు చేశారు. చిన్నారులు గాలిపటాల తో సందడి చేశారు. యువకులు క్రికెట్, వాలీబాల్ లాంటి మ్యాచ్‌లు ఆడుతూ సందడిగా గడిపారు. పలు గ్రామాల్లో ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. అలాగే మహిళలు పిండి వంటల్లో నిమగ్నమయ్యారు. కనుమ సందర్భంగా మటన్, చికెన్ విక్రయాలు పెరిగాయి. – సాక్షి నెట్‌వర్క్


