అప్పుల బాధతో ఒక్కరి ఆత్మహత్య
భిక్కనూరు: అప్పుల బాధతో ఒకరు ఆత్మహత్య చే సుకున్న ఘటన భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై ఆంజనేయులు వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన గాడి నర్సింలు(53) వ్యవసాయం చేస్తు జీవిస్తున్నాడు. కొంత కాలంగా చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలియన మదనపడుతుండేవాడని కుటుంబీకులు తెలిపారు. గురువారం రాత్రి ఇంట్లో భోజనం చేసి బయటకు వెళ్లి నర్సింలు తిరిగి రాలేదు. కుటుంబీకులు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. శుక్రవారం ఉదయం తన వ్యవసాయ పొలంలో చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబీకులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సై తెలిపారు.


