సంక్షిప్తం..
నిబంధనలు పాటించండి.. గమ్యం చేరండి
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్‌లో జిల్లా పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో శుక్రవారం ‘ ఎరైవ్ అలైవ్’ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్‌చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి బృందం పాటలు, మాటల ద్వారా రోడ్డు భద్రతపై ప్రయాణికులకు వివరించారు. ట్రాఫిక్ నిబందనలు పాటించి సురక్షితగా గమ్యానికి చేరాలని కోరారు. హెడ్ కానిస్టేబుల్ శేషారావు, ప్రభాకర్, తదితరులు పాల్గొన్నారు.
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యం
లింగంపేట(ఎల్లారెడ్డి): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ఎరైవ్–అలైవ్ అనే కార్యక్రమం చేపట్టినట్లు ఎస్సై దీపక్‌కుమార్ వెల్లడించారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్‌లో రోడ్డు, భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి ఉద్యమంలా ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలన్నారు. తహసీల్దార్ సురేష్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, సూపరింటెండెంట్ పవన్, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తే ప్రమాదాలు దూరం
పెద్దకొడప్‌గల్(జుక్కల్): రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ ప్రమాదాలను అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఎస్సై అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మండల కేంద్రంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శుక్రవారం మండల పరిషత్ కార్యాలయం సమీపంలో వాహనదారులతో సమావేశం నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీవో అభినవ్ చందర్, ఎంపీవో లక్ష్మీకాంత్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ధర్మారెడ్డి గ్రామీణ బ్యాంకులో..
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): ధర్మారెడ్డి గ్రామీణ బ్యాంకులో శుక్రవారం స్థానిక ఎస్సై భార్గవ్‌గౌడ్ ఆధ్వర్యంలో ఎరైవ్–అలైవ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బందితోపాటు ఖాతాదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు.
రోడ్డు భద్రత నియమాలు పాటించాలి
నస్రుల్లాబాద్: ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఎస్సై రాఘవేంద్ర అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో గల సమీకృత భవనం వద్ద అవగాహన కల్పించారు. ఎరైవ్– అలైవ్ కార్యక్రమంలో భాగంగా వాహనం నడిపే విధానం గురించి వివరించారు. నాయబ్ తహసీల్దార్ బావయ్య, ఆర్‌ఐ వెంకటస్వామి, తదితరులు పాల్గొన్నారు.
సంక్షిప్తం..
సంక్షిప్తం..
సంక్షిప్తం..
సంక్షిప్తం..


