మీకు తెలుసా..
వస్తువుల కొనుగోలులో
లోపం ఉంటే..
రామారెడ్డి : వినియోగదారుడు ఒక వస్తువును కొన్నప్పుడు అ ది పాడైపోయినా, నాణ్యత లేకపోయినా, మోసపోయినా భయపడాల్సిన అవసరం లేదు. భార త వినియోగదారుల రక్షణ చట్టం(కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019) ప్రకారం వారికి పూర్తి హక్కులు ఉంటాయి.
కేసు ఎలా వేయాలి.. ఎక్కడ వేయాలన్న విషయాలను తెలుసుకుందాం.
● రసీదు(బిల్) కొన్న వస్తువుకు సంబంధించిన ఒరిజినల్ బిల్లును భద్రపరచుకోవాలి.
● సంస్థకు ఫిర్యాదు మొదట సదరు కంపెనీ కస్టమర్ కేర్‌కు లేదా షాపు యజమానికి రాతపూర్వకమైన ఫిర్యాదు చేయాలి.
● నోటీసుకు వారు స్పందించకపోతే, ఒక లీగల్ నోటీసు పంపాలి.
● వస్తువు విలువ లేదా కోరుతున్న పరిహారం ఆధారంగా మూడు స్థాయిల్లో కోర్టులు ఉంటాయి.
● స్థాయి వస్తువు విలువ పరిహారం జిల్లా కమిషన్ రూ. 50లక్షల లోపు, రాష్ట్ర కమిషన్ రూ. 50 లక్షల నుంచి రూ. 2 కోట్ల వరకు ఫిర్యాదు చేయాలి.
● జాతీయ కమిషన్ రూ. 2కోట్లకు పైగా నష్టం జరిగితే ఫిర్యాదు చేయాలి.
రెండు రకాలుగా ఫిర్యాదు చేయొచ్చు
● ఆన్‌లైన్ ద్వారా వినియోగదారులు ఇంటి నుంచే edaakhil.nic.in వెబ్‌సైట్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.
● మరొకటి నేరుగా కోర్టులో మీ ప్రాంతంలోని జిల్లా వినియోగదారుల ఫోరమ్‌కు వెళ్లి స్వ యంగా ఫిర్యాదు పత్రాన్ని సమర్పించవచ్చు. దీనికి లాయర్ ఉండాల్సిన అవసరం లేదు.
● అవసరమైన పత్రాలు ఫిర్యాదు చేసేటప్పుడు మీ పేరు, చిరునామా అవతలి వ్యక్తి/కంపెనీ వివరాలు, వస్తువు కొన్న బిల్లు వారంటీ/గ్యారెంటీ కార్డు ఉంటే వాటిని సమర్పించాలి
● వస్తువులో ఉన్న లోపానికి సంబంధించిన ఫొటోలు లేదా ఆధారాలు, మీరు కంపెనీకి పంపిన ఈమెయిల్స్ లేదా నోటీసుల కాపీలు జతచేయాలి.
● మీకు ఏదైనా సందేహం ఉంటే ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్ 18001 14000 లేదా 1915, ఎస్‌ఎంఎస్: 88000 01915 నంబర్‌కు మెసేజ్ పంపి సాయం పొందవచ్చు.


