9న కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

9న కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

Dec 7 2025 8:51 AM | Updated on Dec 7 2025 8:51 AM

9న కల

9న కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టరేట్‌లలో తెలంగాణ తల్లి విగ్రహాలను ఈనెల 9న ఆవిష్కరించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కామారెడ్డి కలెక్టరేట్‌లో రోడ్లు భవనాల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు దిమ్మెను నిర్మించి చుట్టూరా గ్రానైట్‌ను అతికించారు. అలాగే స్టీల్‌ రెయిలింగ్‌ పనులు కూడా పూర్తయ్యాయి. విగ్రహాన్ని తీసుకువచ్చి బిగించారు. మిగిలిన పనులు పూర్తి చేసి ఈనెల 9న విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు.

వామ్మో చలి!

కామారెడ్డి టౌన్‌: జిల్లా కేంద్రంలో చలి తీవ్ర త ఎక్కువగా ఉండడంతో ప్రజలు గజగజ వ ణుకుతున్నారు. కొన్ని రోజులుగా జిల్లాలో క నిష్ట ఉష్ణోగ్రతలు 14 డిగ్రీలకన్నా తక్కువగా నమోదవుతున్నాయి. శనివారం కనిష్ట ఉష్ణోగ్రత10.3 డిగ్రీలుగా నమోదయ్యింది. చలి ఎక్కువగా ఉండడంతో తెల్లవారుజామునే పనులకు వెళ్లేవారు ఇబ్బందిపడుతున్నారు.

వచ్చేనెలలో కామారెడ్డిలో

రాష్ట్ర స్థాయి సైన్స్‌ఫెయిర్‌

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : ఏటా నిర్వహించే రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ను ఈసారి కామారెడ్డి జిల్లాలో నిర్వహించనున్నారు. వచ్చే నెలలో రాష్ట్ర స్థాయి సైన్స్‌ ఫెయిర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర విద్యాశాఖ ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఏడాదికో జిల్లాలో రాష్ట్ర స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేస్తుంటారు. దీనికి ఈసారి కామారెడ్డి వేదిక కానుంది. జిల్లా కేంద్రంలోని ఏ పాఠశాలలో ఏర్పాటు చేయాలన్న విషయాన్ని జిల్లా విద్యాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు. తేదీలు ఇంకా ఖరారు కావాల్సి ఉంది.

ఈవీఎం గోదాం

పరిశీలన

కామారెడ్డి క్రైం: కలెక్టరేట్‌కు సమీపంలోని ఈవీఎం గోదాంను కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ శనివారం రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి సందర్శించారు. ఈవీఎంలు, ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన గదులను పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై సూచనలు ఇచ్చారు. సీసీ కెమెరాలు నిరంతరాయంగా పనిచేసేలా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట అదనపు కలెక్టర్‌ విక్టర్‌, ఆర్డీవో వీణ, తహసీల్దార్‌ జనార్దన్‌, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బంది ఉన్నారు.

కోడ్‌ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు

ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌ పేర్కొన్నారు. మూడు విడతల్లో ఎన్నికలు పూర్తయ్యే వరకు మోడల్‌ కోడ ఆఫ్‌ కండక్ట్‌ అమలులో ఉంటుందన్నారు. ప్రతి ఒక్కరూ నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేశారు.

గ్లోబల్‌ సమ్మిట్‌కు పైడి ఎల్లారెడ్డికి ఆహ్వానం

కామారెడ్డి టౌన్‌: రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్‌లో నిర్వహించే గ్లోబల్‌ సమ్మిట్‌కు సంబంధించి జిల్లాకు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త పైడి ఎల్లారెడ్డికి ఆహ్వానం అందింది. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 8, 9 తేదీలలో హైదరాబాద్‌లో తెలంగాణ రైజింగ్‌ విజన్‌–2047 గ్లోబల్‌ సమ్మిట్‌ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి తనను ఆహ్వానించినందుకు ఎల్లారెడ్డి హర్షం వ్యక్తం చేశారు.

9న కలెక్టరేట్‌లో తెలంగాణ  తల్లి విగ్రహం ఆవిష్కరణ 
1
1/1

9న కలెక్టరేట్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement