
జవాబుదారీతనమే ప్రధానం
కామారెడ్డి క్రైం : జవాబుదారీతనం గల సమాజాన్ని నిర్మించే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. ప్రభుత్వ కార్యాలయాల పీఐవో(పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్)లు, జిల్లా, డివిజన్, మండల స్థా యి అఽధికారులకు మంగళవారం కలెక్టరేట్‌లో సమా చార హక్కు చట్టంపై అవగాహన కల్పించారు. సమావేశంలో రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్‌తో పాటు సమాచార కమిషనర్‌లు మొహ్సినా పర్వీన్, దేశాల భూపాల్, అయోధ్య రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో చీఫ్ కమిషనర్ మాట్లాడుతూ తక్కువ ఫి ర్యాదులు ఉన్న జిల్లాల్లో కామారెడ్డి మూడో స్థానంలో ఉందన్నారు. ఇక్కడ జవాబుదారీతనం ఎక్కువగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. ప్రభుత్వం నుంచి నిధులు వచ్చే ప్రతి కార్యాలయం, సంస్థలకు సంబంధించిన సమాచారాన్ని పౌరులు పొందవచ్చన్నారు. ఇందుకోసం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీఐవోలను తప్పనిసరిగా నియమించాల న్నారు. రికార్డులు, ఉద్యోగుల వివరాలు, విధులు, బాధ్యతలతో కూడిన 41బి రిజిస్టర్‌లు అన్ని కార్యాలయాల్లో అందుబాటులో ఉండాలన్నారు. సమాచారం అడిగే వ్యక్తి ఎందుకు సమాచారం అడుగుతున్నాడో చెప్పాల్సిన అవసరం లేదన్నారు. దరఖాస్తు తీసుకున్న 30 రోజుల్లోగా (సేకరించి ఇవ్వాల్సిన సందర్భాల్లో 45 రోజులు) పీఐవో సమాచారం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. లేని పక్షంలో దరఖాస్తుదారుడు మొదటి అప్పీల్ చేసుకోవచ్చన్నారు. 90 రోజుల్లోగా సమాచారం రాకుంటే రెండో అప్పీల్‌కు వెళ్లవచ్చన్నారు. ఆలస్యం చేస్తే నష్టపరిహారం వరకు వెళ్లే వెసులుబాటు చట్టంలో ఉందన్నారు. అన్ని స్థాయిల అధికారులు సమాచార హక్కు చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు.
పారదర్శకతతోనే విశ్వసనీయత..
ప్రతి పౌరుడికి సమాచారం
అడిగే హక్కు ఉంది
తక్కువ ఫిర్యాదులున్న జిల్లాల్లో
కామారెడ్డికి 3 స్థానం
రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్
చంద్రశేఖర్‌రెడ్డి
పారదర్శకత, జవాబుదారీతనం, అవినీతి రహి త పాలనతోనే ప్రజల్లో విశ్వసనీయత పెరుగు తుందని కమిషనర్ అయోధ్యరెడ్డి పేర్కొన్నారు. పీఐవోలు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. కార్యాలయాల్లోని పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచుకోవాలన్నారు. కమిషన్ ఆధ్వర్యంలో ఏ కార్యాలయంలో, ఎప్పుడైనా తనిఖీ లు జరిగే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల అధికారులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. భోజన విరామం తర్వాత జరిగిన రెండో సెషన్‌లో జిల్లాకు సంబంధించి రెండో అప్పీల్ కేసులపై శాఖల వారీ గా విచారణ జరిపారు. కార్యక్రమంలో ఎస్పీ రాజేశ్‌చంద్ర, బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అదనపు కలెక్టర్లు విక్టర్, చందర్, ఆర్డీవోలు వీణ, పార్థసింహారెడ్డి, వివిధ శాఖల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు, పీఐవోలు, సిబ్బంది పాల్గొన్నారు.

జవాబుదారీతనమే ప్రధానం