
● అ‘పూర్వ’ సమ్మేళనం
బోధన్: సాలూర మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఆదివారం 2003–2004కు చెందిన పదో తరగతి పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. 21 ఏళ్ల తర్వాత అందరూ ఒకే చోట చేరడంతో సంతోషం వ్యక్తం చేశారు. నాటి జ్ఞాపకాలను నెరమరేసుకున్నారు. సమ్మేళనానికి ఎంఈవో రాజీ మంజూష, నాటి పాఠశాల ఉపాధ్యాయుడు విశ్రాంత హెచ్‌ఎం గోపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు మనోహర్, గురుదత్తు, హన్మాండ్లు, గణేశ్, శ్రీనివాస్, ఇల్తెపు గంగారాంలను ఆహ్వానించి సన్మానించారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు చీల శంకర్, చిద్రపు అశోక్, లక్ష్మణ్, సాయిలు, రాజు, భీంరావు, భీమేశ్, వెంకటేశ్, గంగాప్రసాద్, రవి తదితరులు పాల్గొన్నారు.